Home » చుట్టమల్లె (Chuttamalle) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1

చుట్టమల్లె (Chuttamalle) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1

by Vinod G
2 comments
chuttamalle song lyrics devara part one

చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు..
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు..

రా నా నిద్దర కులాసా
నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాసా
రా నా ఆశలు పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్ధం చేశా

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం వోణి కట్టింది
గోరింట పెట్టింది

సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ.. అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు..

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరీ
వాస్తుగా పెంచనిట్ఠా వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ
చేయరా ముద్దుల దాడి ఇష్టమే నీ సందడీ
ముట్టడించి ముట్టేసుకోలేవా ఓ సారి చేజారీ..

రా ఏ బంగరు నెక్లీసు నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను సింగారించు..
రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచం ఆలోచించు

ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం వోణి కట్టింది
గోరింట పెట్టింది

సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ.. అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు…


చిత్రం: దేవర (Devara) పార్ట్ – 1 (2024)
తారాగణం: జూ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ప్రకాష్ రాజ్(Prakash Raj), సైఫ్ అలీ (Saif Ali Khan) ఖాన్, శ్రీకాంత్ (Srikanth), షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తదితరులు
గాయకులు: శిల్పా రావు (Shilpa Rao)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
చిత్ర దర్శకత్వం: కొరటాల శివ (Koratala Siva)

దూకే ధైర్యమా జాగ్రత్త సాంగ్ లిరిక్స్ – దేవర పార్ట్ – 1

ఆయుధ పూజ ( Ayudha Puja) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara)

దావుడి (Daavudi) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

2 comments

Ntr August 5, 2024 - 12:39 pm

Nice song. NTR fans assemble🔥🔥🔥🔥

Reply
Ntr August 5, 2024 - 12:42 pm

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

Reply

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.