Home » భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం

భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం

by Shalini D
0 comments

విరామ సమయంలో ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనాలు, అర్చనలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
కొత్తగూడెం : భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం భక్తులకు జూలై 2వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. విరామ సమయంలో ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనాలు, అర్చనలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి వచ్చింది. ఉ.9 నుంచి 9.30 వరకు, రా.7 నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలను నిలిపివేస్తారు. టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్ల వద్ద, వెబ్‌సైట్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.

You may also like

Leave a Comment