73
రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల గుండెల్లో మంట ,జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు డైవర్టిక్యులర్ వ్యాధి నుంచి మలబద్ధకం, కొలొరెక్టల్ క్యాన్సర్ వరకు అన్నింటినీ నిరోధించడంలో సహాయపడుతుంది.
మనలో చాలా మందికీ రాత్రి పూట భోజనం తరువాత కాసేపు నడిచే అలవాటు ఉంటుంది. ఇలా భోజనం తరువాత కనీసం 10 నిమిషాల పాటు నడవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహాన్ని కూడా నివారించుకోవచ్చు. ఈ అలవాటు మలబద్దకం, నిద్ర లేని సమస్యలను దూరం చేస్తుంది. అన్నం తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఛాతీలో ఇరిటేషన్ తో పాటు గ్యాస్ సమస్యలు మొదలవుతాయని వైద్యులు అంటున్నారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.