ayodhya nagaramuna velasina raghu rama lyrics

అయోధ్య నగరమున వెలసిన రఘురామ…పాట లిరిక్స్

by Lakshmi Guradasi

పల్లవి:
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…
పలికెదము మేము మధురముగా నీ నామమే ఓ రామ…
పలికెదము మేము మధురముగా నీ నామమే ఓ రామ…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…

చరణం 1:
నీ దివ్య రూపము చూసేటి భాగ్యము
నీ దివ్య రూపము చూసేటి భాగ్యము
కలుగించు మాకు శ్రీరాముడవై…
కలుగించు మాకు శ్రీరాముడవై…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…

చరణం 2:
నీ నామ భజనలు చేసేము నిరతము
నీ నామ భజనలు చేసేము నిరతము
మాలోన బాధలు ఎన్నెన్నో ఉన్నా…
మాలోన బాధలు ఎన్నెన్నో ఉన్నా…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…

చరణం 3:
నీ కరుణ కోసము నీ చెంత నిలిచేము
నీ కరుణ కోసము నీ చెంత నిలిచేము
మాలోని కష్టాలు తొలగించు రామ…
మాలోని కష్టాలు తొలగించు రామ…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…

చరణం 4:
నీకెంతో వేడుక చేసేము రామయ్య
నీకెంతో వేడుక చేసేము రామయ్య
శ్రీరామ నవమి ఓ రఘురామ…
శ్రీరామ నవమి ఓ రఘురామ…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
జగదభి రఘురామ మా దేవుడు నీవయ్యా…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…
అయోధ్య నగరమున వెలసిన రఘురామ…
వెలసిన రఘురామ… వెలసిన రఘురామ…
వెలసిన రఘురామ… వెలసిన రఘురామ…

________________

Song Credits:

పాట: అయోద్య రఘు రామ (Ayodya Raghu Rama)
గానం : రాంపల్లి శీను (Rampalli Seenu)
సాహిత్యం : బి. రాజశేఖర్ (B. Rajashekar) [ పోతుగల్లు ]
సంగీతం: విక్కీ (Vikky)

పూర్తి జాబితా కోసం దీనిని క్లిక్ చేయండి  👇 :

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.

You may also like