26
మన భారత దేశం లో ఒక కొత్త ఇల్లు లేదా స్థలం కొంటున్న అప్పుడు వాస్తు చూడడం, ఏవైనా ప్రయాణాలు చేసేప్పుడు ఏ రోజు ఏ దిక్కున ప్రయాణం చేయడం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే వీటన్నిటికీ దిక్కులు అనేవి చాల ముఖ్యం. మనకు మొత్తంగా నాలుగు దిక్కులు, నాలుగు మూలాలు ఉన్నాయి. తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం దిక్కులుగా; ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఆయా దిక్కులకి మధ్యలో ఉండే మూలలు గా చెప్పేరు.వీటినే అష్ట దిక్కులు అని ఈ దిక్కులని పాలించే వారినే అష్ట దిక్పాలకులు అని పిలుస్తాము.
దిక్కులు | పాలకులు | ఆయుధాలు | వాహనం |
తూర్పు | ఇంద్రుడు | వజ్రాయుధం | ఐరావతం |
పడమర | వరుణుడు | పాశం | మొసలి |
ఉత్తరం | కుబేరుడు | ఖడ్గం | గుర్రం |
దక్షిణం | యముడు | దండం | మహిషం |
ఆగ్నేయం (తూర్పు-దక్షిణం) | అగ్ని | శక్తీ | తగరు |
నైరుతి (దక్షిణం-పడమర) | నైరుతి | కుంతం | నరుడు |
వాయువ్యం (పడమర-ఉత్తరం) | వాయువు | ధ్వజం | లేడి |
ఈశాన్యం (ఉత్తరం-తూర్పు) | ఈశాన్యుడు | త్రిశులం | వృషభం |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.