Home » ఆర్టికల్ 361పై ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది

ఆర్టికల్ 361పై ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది

by Shalini D
0 comment

బెంగాల్ గవర్నర్ CV ఆనంద్ బోస్‌ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించిన ఓ మహిళా ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు రక్షణ కల్పించడాన్ని సవాల్ విసిరారు. ‘లైంగిక వేధింపులు గవర్నర్ అధికారిక విధుల్లో భాగంగా పరిగణిస్తారా? గవర్నర్ పదవిని కోల్పోయే వరకు న్యాయం కోసం ఎదురుచూడాలా? నా లాంటి బాధితురాలికి కోర్టు ఉపశమనం కలిగిస్తుందా? లేదా? అనేది చెప్పాలి’ అని కోరారు.

ఆర్టికల్ 361 ఏం చెబుతోంది?

క్రిమినల్ విచారణ, అరెస్టు నుంచి రాజ్యాంగం ఆర్టికల్‌ 361 ద్వారా రాష్ట్రపతి, గవర్నర్లకు రక్షణ కల్పించింది. తమ అధికారాలు, విధుల నిర్వహణలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు, చర్యలను ప్రశ్నించే, అరెస్టు చేసే అధికారం ఏ కోర్టుకూ లేదని ఆర్టికల్‌ 361లోని క్లాజ్(1),(2) చెబుతున్నాయి. 2006లో రామేశ్వర్ ప్రసాద్vs కేంద్రప్రభుత్వం కేసులో గవర్నర్ వేధింపుల ఆరోపణలపైనా సుప్రీంకోర్టు ఇమ్యూనిటీ ఇచ్చింది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment