Home » ఇరుసులేని చక్రాల ఈ సైకిల్

ఇరుసులేని చక్రాల ఈ సైకిల్

by Rahila SK
0 comments

ఈ సైకిల్, ఈ – బైక్ లు ఇటీవలి కాలంలో రకరకాలుగా వస్తున్నాయి. వాటన్నంటి కంటే విలక్షణమైనది. ఈ ఫొటోలో కనిపిస్తున్నఈ సైకిల్. ఎలాంటి బండి చక్రాలకైనా ఇరుసు ఉండటం మాములు. అయితే, ఇరుసు లేని చక్రాలతో ఈ ఈ -సైకిల్ రూపందించడమే విశేషం. దక్షిణ కొరియన్ కంపెనీ “టాప్ సీక్రెట్” ఈ సైకిల్ ను ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ సైకిల్ చక్రాలకు ఇరుసు లేకపోవడమే కాదు, వాటి టైర్లకు గాలి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. లోపల ట్యూబులు లేకుండా, వృడమైన టైర్లను ఈ చక్రాలకు అమర్చారు.

దీనిపై ఒక మనిషి సునాయాసంగా ప్రయణించవచ్చు. అంతేకాదు, 120 కిలోల బరువు ఉన్న సరుకులను కూడా తీసుకుపోవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్ చేసుకుంటే నిరంతరాయంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. కార్బన్, ఫైబర్ ఫ్రెమ్, రేర్ వ్యూ కెమెరా, టచ్ స్క్రీన్ డిస్ ప్లే, బిల్ట్ ఇన్ జీపీఎస్ సిస్టమ్, స్పార్ట్ లాక్ వంటి అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఈ – సైకిల్ ధర 3,999 డాలర్లు (రూ. 3.32 లక్షలు).

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టెక్నాలజీను సందర్శించండి.

You may also like

Leave a Comment