Home » పిచ్చుక సలహా మరియా ఉడుత సాయం – నీతి కథ

పిచ్చుక సలహా మరియా ఉడుత సాయం – నీతి కథ

by Shalini D
0 comment

ఒక ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక మరియా ఉడుత నివాసం ఉండేవి. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరోజు ఉడుత మామిడి కాయలు తింటూ ఉండగా. చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులొంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి. వాటి దగ్గరకు వెళ్లి చూడగా వాటి తల్లి లేదు. బహుశా ఆహారం కోసం వెళ్లిన వాటి తల్లి కోసం ఎదురుచూస్తున్నాయి అనుకుంది. ఎంత సేపటికి పిల్లల అరుపులు ఆగకపోవఢంతో మరోసారి వెళ్లి చూస్తుంది. అయినప్పటికీ తల్లి రాలేదు.

ఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన పిచ్చుకకు చెప్పింది అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏమి చేయగలము అని ప్రశ్నించింది?” వాటి తల్లి ఏదైన ప్రమాదానికి గురై ఉండవచ్చు, ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాద్యత నేను తీసుకుంటాను. వాటికీ ఆహారం అందించి పెద్ద చేస్తాను” అని చెప్పింది ఉడుత.

అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది, నీది మంచి ఆలోచనే కానీ… ఆ పక్షిపిల్లలకు ఆహారం సేకరించుకోవడ, ఎగరడం అన్ని వాటి తల్లి నుంచే నేర్చికోవాలి. అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనప్రమాదం లో ఉందిమో వెళ్లి చూడు. అని సలహా ఇచ్చింది. ఉడుత వెతుకుతూ ఉండగా ఒక చెట్టుకింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది.

ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడి గురితప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది. వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యలు చేసి… పిల్లల వద్దకు చేర్చింద. తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడుతకు తల్లిపక్షి కృతజ్ఞతలు చెప్పకుంది.

నీతి: సహాయం చేయాలనుకుంటే, సరైన మార్గాన్ని అనుసరించడం మరియు అవసరమైన సమయంలో స్నేహితులకు సహాయం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment