Home » కోడి – బంగారు గుడ్లు

కోడి – బంగారు గుడ్లు

by Vinod G
1.4K views
kodi bangaru gudlu moral story

అనగనగ ఒక ఊరిలో పేద రైతు ఉండేవాడు. అతడు రోజంతా చాల కష్టపడి పనిచేస్తేనే గాని పూట గడిచేది కాదు. అతడు రోజూ పొలం పనులు చేసేవాడు. అతడి దగ్గర ఒక చిన్న కోడి కూడా ఉండేది.

ఒకరోజు ఆ కోడి ఓ ఆశ్చర్యకరమైన గుడ్డు పెట్టింది, “అది బంగారు గుడ్డు”. అది చూసిన రైతు మొదట నమ్మలేదు. కానీ దానిని తీసుకుని మార్కెట్‌కు తీసుకెళ్లి స్వర్ణకారిచేత పరీక్షించాడు, అప్పుడు అది బంగారమే అని తెలిసింది. దీంతో రైతుకు అమిత ఆనందం వేసింది.

ఆ బంగారు గుడ్డును మార్కెట్ లో అమ్మివేసి అతనికి కావలసిన సరుకులు అన్నీ కొనుక్కున్నాడు.
మరుసటి రోజు కూడా ఆ కోడి బంగారు గుడ్డునే పెట్టింది. అది గమనించిన రైతు ఇంకా చాల సంతోషపడి దాన్ని కూడా మార్కెట్ లో అమ్మివేసి సొమ్ము చేసుకున్నాడు.

ఇలా ప్రతి రోజు ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టసాగింది. రైతు దాని ద్వారా ధనవంతుడయ్యాడు. కానీ కొద్ది రోజులు తరువాత అతనికి ఓ కోరిక కల్గింది.”అది అత్యాశ కోరిక”.

“రోజుకు ఒక్క గుడ్డే ఎందుకు? ఈ కోడి పొట్టలో మొత్తం బంగారమే ఉంటే… ఒక్కసారి కోడిని కోసేస్తే అన్నీ గుడ్లు ఒక్కసారిగా వస్తాయేమో!”అని అనుకున్నాడు. ఆలోచించాడో లేదో వెంటనే కోడిని కోసేశాడు.

కానీ కోడి పొట్టలో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు! అది సాధారణ కోడి మాదిరిగానే వుంది, ఇప్పుడు ఆ కోడి చనిపోయింది. అప్పటినుండి అతడు ఒక్క బంగారు గుడ్డూ కూడా పొందలేకపోయాడు. తాను చేసిన తప్పును గ్రహించాడు. అత్యాశ కోరిక వలన చేసిన పనికి చాల బాధపడ్డాడు.

నీతి: అత్యాశ అనేది మన చేతిలో ఉన్న సంపదను కూడా నాశనం చేస్తుంది. సంతోషంగా, ఓర్పుగా ఉండడం చాల ముఖ్యం.


👉ఇటువంటి మరిన్ని వాటి కోసం చూడండి తెలుగురీడర్స్ నీతి కథలు

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.