Home » Agamma Agaradhe Radhamma folk song | ఆగమ్మ ఆగరాదే రాధమ్మ సాంగ్ లిరిక్స్

Agamma Agaradhe Radhamma folk song | ఆగమ్మ ఆగరాదే రాధమ్మ సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
3.2K views
Agamma Agaradhe Radhamma song lyrics dj folk

ఘల్లు ఘల్లు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే
పిల్ల మనస్సు దోచుకుంటివే

పొద్దాస్తు నా చుట్టూ తిరుగుతుంటావు
పని పాట లేనట్టు ఆగమైతావు
వద్దంటే వినకుండానే
నిన్ను ప్రేమించమని అంటావు

ఆగమ్మ ఆగరాదే రాధమ్మ
బంగారు నా బొమ్మవే
సిత్రాల నా చిన్నివే రాధమ్మ
నా చిట్టి చిలకమ్మవే

ఆగితే ఎట్టాగయ్యో ఓ పిల్లగా
నన్నిట్ట ఏం చేస్తావో
ని మాయ మాటాలతోటి
నన్నే మొత్తంగా బందిస్తావో

ఘల్లు ఘల్లు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే
పిల్ల మనస్సు దోచుకుంటివే

సోయగాల ని సూపులతో
సొమ్మసిల్లగా ఆ మత్తు జల్లినవే
ఇల్లు జాడ మరిచి ని కోసమే
కాపుకాసి ఎదురు చూస్తుంటానే

నన్నింకా మెప్పించే ని ప్రేమలో దించి
ని వైపుకే నన్ను మళ్ళీస్తివే
నా నీడ నాతోడు విడిచిపోయెనే
ని తీరుగా నేను నువ్వైతినే

వాగు వంకల తీరు
వారి చేల అందాలు
మన ప్రేమకే గుర్తులు

వాగు వంకల తీరు
వారి చేల అందాలు
మన ప్రేమకే గుర్తులు

నీకు నాకు మధ్య సాక్ష్యంగా
మిగిలేరు ఈ పంచ భూతాలు
ఈ పంచ భూతా…

పొద్దాస్తు నా చుట్టూ తిరుగుతుంటావు
పని పాట లేనట్టు ఆగమైతావు
వద్దంటే వినకుండానే
నిన్ను ప్రేమించమని అంటావు

ఘల్లు ఘల్లు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే
పిల్ల మనస్సు దోచుకుంటివే

మానసిచ్చిన నీకు మాటిచ్చినానమ్మ
మనసారా మనువాడుకుంటానని
పది కాలాలు గుండెలో దాసుకుంటానే
నిన్ను విడిచి యెడపోనని

ని కౌగిట్లో సరసంగా చేరుకొని
నా తనువంతా నీకే పంచుకుంట
జన్మంతా నీ చెంత ఉండిపోగా
నా బతుకంతా నీకే ఇచ్చుకుంటా

ఈనాటి అనుబందమేనాటిదో
అంటూ మనమిట్ల మురిసిపోగా

ఈనాటి అనుబందమేనాటిదో
అంటూ మనమిట్ల మురిసిపోగా

జన్మ జన్మాలకే ఇంకా వీడిపోని
బంధాన్ని ఆ దేవుడు ముడి వెయ్యగా
ఆ దేవుడు ముడి వెయ్యగా

ఘల్లు ఘల్లు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే
పిల్ల మనస్సు దోచుకుంటివే

పొద్దాస్తు నా చుట్టూ తిరుగుతుంటావు
పని పాట లేనట్టు ఆగమైతావు
వద్దంటే వినకుండానే
నిన్ను ప్రేమించమని అంటావు

ఆగమ్మ ఆగరాదే రాధమ్మ
బంగారు నా బొమ్మవే
సిత్రాల నా చిన్నివే రాధమ్మ
నా చిట్టి చిలకమ్మవే

ఆగితే ఎట్టాగయ్యో ఓ పిల్లగా
నన్నిట్ట ఏం చేస్తావో
ని మాయ మాటాలతోటి
నన్నే మొత్తంగా బందిస్తావో

________________________________________________

మ్యూజిక్ : వెంకట్ అజ్మీర
ప్రొడ్యూసర్ : హనుమంతు
లిరిక్స్ : కళ్యాణ్ సుమిత్ర
సింగెర్స్ : బొడ్డు దిలీప్ – బట్టు శైలజ
నటీనటులు : హనుమంతు, లాస్య స్మైలీ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.