Home » జాజికాయ పొడిని ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

జాజికాయ పొడిని ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

by Shalini D
279 views
Benefits of applying nutmeg powder on face

జాజికాయ ఒక రకమైన నేచురల్ ఎక్స్ఫోలియేట్, ఇది ముఖంపై ఉన్న మృతకణాలు తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. జాజికాయను ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. మెరిసే చర్మానికి జాజికాయ వల్ల అనేక లాభాలున్నాయి. జాజికాయను గంధంలా నూరి ముఖానికి రాసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెల్సుకోండి. గంధం నూరే చెక్క మీద కాస్త నీల్లు చిలకరించి జాజికాయను నూరితే గంధం లాగా వస్తుంది. లేదంటే జాజికాయను పొడి చేసుకుని అందులో నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవచ్చు.

జాజికాయ లేపనం మొటిమల సమస్యను తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఈ జాజికాయ లేపనం మొటిమలున్న చోట రాసుకుంటే క్రమంగా సమస్య తగ్గుతుంది. మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తే.. జాజికాయ లేపనం రాసి చూడండి. తేమ అంది మృదువుగా మారుతుంది.

చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మంపై ముడతలు, గీతలు లాంటి సమస్యలుంటే క్రమంగా జాజికాయ వల్ల తగ్గిపోతాయి. జాజికాయ లేపనం రాయడం వల్ల మృతకణాలు తొలిగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. చర్మపు మంట మరియు దద్దుర్లు నుండి ఉపశమనం కోసం జాజికాయ లేపనం వాడొచ్చు. ఇది చర్మానికి చల్లదనం, సాంత్వన ఇస్తుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.