87
అనగనగా ఒక చెరువు ఉండేది. దానిలో రెండు కప్పలు ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు రోజు కలిసి చెరువులో ఆడుకునేవి. ఒకరోజు అలా తిరుగుతున్నప్పుడు, వాటికీ ఈగలు కనిపించాయి. ఆ ఈగలు గోడ అవతలున్న తోటలో ఉన్నాయి. కప్పలకి ఎలాగైనా ఈగల్ని తినాలనిపించింది. ఆ గోడ చాలా ఎత్తుగా ఉండడం వల్ల కప్పలు నిరాశ చెందాయి. కప్పలు రెండు ఎలా లోపలికి వెళ్ళాలి? అని ఆలోచించాయి. అప్పుడే ఒక కప్పకు మంచి ఆలోచన వచ్చింది, అవి రెండు కలిసి రంధ్రాన్ని వెతకాలి అనుకున్నాయి. మరో కప్పకు అప్పుడే ఒక రంధ్రం కనిపించింది. రెండు కలిసి రంధ్రం గుండా తోటలోకి వెళ్లిపోయాయి.
నీతి: ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా దాటవచ్చు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చుడండి.