అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా
నువ్వే లేక వాసి వాడనమ్మ
మాటే లేకుండా నువ్వే మాయం
కన్నీరవుతోంది యదలో గాయం
అయ్యో వెళ్ళిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే
అమ్మ ఇకపై నే వినగలనా నీ లాలి పాట
నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావో అంతే చాలంట
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా
నువ్వే లేక వాసి వాడనమ్మ
చెరిగిందే దీపం కరిగిందే రూపం
అమ్మ నాపై ఎమంత కోపం
కొండంత శోకం నేనున్న లోకం
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం
నాకే ఎందుకు శాపం
జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైన నడి రేయి ముసిరింది
కలవర పెడుతుంది పెను చీకటి
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది
బ్రతికి సుఖమేమిటి
ఓ అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా
నువ్వే లేక వాసి వాడనమ్మ
వీడలేక నిన్ను విడిపోయి ఉన్నా
కలిసే లేనా నీ శ్వాసలోన
మరణాన్ని మరిచి జీవించి ఉన్నా
ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన
నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా
కలతను రానీకు కన్నంచన
కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరాలోన
చిగురై నిను చేరానా
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా
నువ్వే లేక వాసి వాడనమ్మ
అడుగై నీతోనే నడిచొస్తున్నా
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా
అయ్యో వెళ్ళిపోయావే.. నీలో ప్రాణం నా చిరునవ్వే
అమ్మ ఇకపై నే వినగలనా నీ లాలి పాట
వెంనంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా
In English Version:
Amma amma ne pasivadnamma
Nuvve leka vaasi vadanamma
Mate lekunda nuvve mayam
Kanneeravutondi yadalo gayam
Ayyo vellipoyave nannodilesi etu poyave
Amma ikapai ne vinagalana nee lali pata
Ne pade jolaku nuvvu kannetti chusavo ante chalanta
Amma amma nee pasivadanamma
Nuvve leka vaasi vadanamma
Cheriginde deepam kariginde rupam
Amma napai emanta kopam
Kondanta shokam nenunna lokam
Nanne chustu navvindi shunyam
Nake enduku shapam
Janmala gatame chesina papam
Pagale digulaina nadi reyi musirindi
Kalavara pedutundi penu cheekati
Upiri nannodili neela vellipoyindi
Bratiki sukhamemiti
O amma amma ne pasivadnamma
Nuvve leka vaasi vadanamma
Veedaleka ninnu vidipoyi unna
Kalise lena nee shwasalona
Marananni marichi jeevinchi unna
E chota unna nee dhyasalona
Nijamai ne lekunna kanna ninne kalagantunna
Kalam kalakalam okalage nadichena
Kalatanu raneeku kannanchana
Kasire shishiranni velivesi thvaralona
Chigurai ninu cherana
Amma amma ne pasivadnamma
Nuvve leka vaasi vadanamma
Adugai neetone nadichostunna
Addamlo nuvvai kanipistunna
Ayyo vellipoyave.. neelo pranam na chirunavve
Amma ikapai ne vinagalana nee lali pata
Vennante chirugalai janmanta jolali vinipistu unta
___________________
Song Credits:
పాట పేరు: అమ్మా అమ్మ (Amma Amma)
సినిమా పేరు: రఘువరన్ బి టెక్ (Raghuvaran B Tech)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: S.జానకి (S.Janaki), దీపు (Deepu)
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
నటీనటులు: ధనుష్ (Dhanush), అమలా పాల్ (Amala Paul)
See Also plz click on this:
po-pove-yekantham-song-lyrics-raghuvaran-b-tech
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.