Home » జ్వరం రాకుండానే..డెంగీ భారిన పడుతున్నారా…కారణమేంటి?

జ్వరం రాకుండానే..డెంగీ భారిన పడుతున్నారా…కారణమేంటి?

by Vinod G
0 comment

హాయ్ తెలుగు రీడర్స్ ! ఈ మధ్య కాలంలో ఇటువంటి డెంగీ జ్వరం ఎక్కువుగా వస్తుంది. ఇది మనకి వచ్చిందని కూడా తెలియదు, ఎదో సమస్య అని రక్త పరీక్షలు చేసినపుడు అది డెంగీ అని తేలుతుంది. సాధారణంగా ‘డెంగీ’ వస్తే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరు వ్చక్తుల్లో ఈ తీవ్రమ్తెన జ్వరం లక్షణాలు లేకుండానే డెంగీ వస్తోంది. టెస్టుల్లో ఈ విషయం బయటపడుతోంది. ఇలా జ్వరం లేకుండా డెంగీ రావడాన్ని ‘అఫెబ్రిల్ డెంగీ’ అంటారు.

ఇది ఎక్కువగా డయాబెటిస్ పేషెంట్లు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లలో జ్వరం కాకుండా ఇతర డెంగీ లక్షణాలు ఉంటాయి. ఈ డెంగీ వచ్చినట్లు గుర్తించడం కష్టమవుతుంది. డాక్టరు దగ్గరకు వెళ్లేందుకు మీరు అలస్యం చేస్తారు. తీరా పరీక్ష నిర్వహించాకే ప్లేట్ లేట్స్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రమాదం ఉండదు. అప్పటికే ప్లేట్ లేట్స్ సంఖ్య బాగా తగ్గితే ప్రమాదకరంగా మారొచ్చు.

ఇది ఎవరికీ వస్తుంది, ఎలా వస్తుంది?

వృద్ధులు, రోగ నిరోధిక శక్తి తక్కువగా ఉన్నవారు, డయాబెటిస్ రోగులు, క్యాన్యర్ పేషెంట్లలో ఈ రకమైన డెంగీ ఎక్కవగా కనిపించే అవకాశం ఉంది. ఎవరికైనా ఎక్కువుగా ఒళ్లు నొప్పలు, అలసటగా అనిపించడం, ఆకలి తగ్గడం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉండి జ్వరం లేకుంటే అవి ‘అఫెబ్రిల్ డెంగీ’ లక్షణాలుగా బావించవచ్చని వైద్యులు చెపుతున్నారు.

డెంగీ దోమ కాటు వల్ల రక్తంలోకి తక్కువ పరిమాణంలో వైరస్ ప్రవేశిస్తుంది. అందుకే ‘అఫెబ్రిల్ డెంగీ’ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం లేకుండా డెంగీ లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. డెంగీ తక్కువగున్నా లేదా ఎక్కువగున్నా నీరు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగి సరైన విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

తగ్గిన రక్త కణాలను పెంచుకోవాలంటే..

డెంగీ, టైపాయిడ్ వస్తే ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. వీటి సంఖ్యను పెంచడంలో కివి, బొప్పాయి, కొబ్బరినీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని డాక్టరు సూచన ప్రకారం తగిన మోతాదులో తీసుకోవాలి.

కివి పండులో విటమిన్ సి, ఇ, పొటషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి డెంగ్యు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి ఇంకా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆస్తమాతో బాధపడే డెంగ్యూ రోగులు కివిపండుని తీంటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది.

కొబ్బరి నీళ్లలో శరీరానికి తక్షణ శక్తిని అందించే అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. కొబ్బరి నీళ్లలో విటమిన్ బి, సి, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్ తో పాటు సోడియం, కాపర్ పెద్ద మొత్తంలో ఉంటాయి, ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

డెంగ్యూ జ్వరం చికిత్సలో బొప్పాయి పండు, ఆకు రసం ఉపయోగిస్తారు. ఇవి రెండూ కూడా డెంగ్యూ సోకిన వ్యక్తిలో న్యూట్రోఫిల్స్, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్లను పెంచడంలో సహాయపడతాయని పరిశోధనలో తేలింది. డెంగ్యూ రోగులు బొప్పాయి పండును, ఆకుల రసాన్ని డాక్టరు సూచనల మేరకు తీసుకోవాలి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment