Home » మీరు ‘టీ’ని ఎక్కువసేపు మరిగిస్తున్నారా?

మీరు ‘టీ’ని ఎక్కువసేపు మరిగిస్తున్నారా?

by Vinod G
297 views
long time boiling tea effects

హాయ్ తెలుగు రీడర్స్ ! మనలో చాలా మందికి ఉదయం లేవగానే, ఇంకా బ్రేక్ ఫాస్ట్ అవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. రోజూ వీటిని తాగకుండా కొందరు ఉండలేరు. మరికొందరు సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడే టీ లేదా కాఫీ తాగుతుంటారు. టీ తయారు చేయడం, తాగడం అంటే చాలా మందికి ఇష్టమే. అయితే ‘టీ’ని తయారు చేసేటప్పుడు ఎక్కువసేపు మరిగించడం మంచికాదని నిపుణులు చెబుతున్నారు. అతిగా మరిగించడం వల్ల పాలతో తయారు చేసిన ‘టీ’ ద్వార లభించే శక్తి తగ్గిపోతుందట. ‘

టీ’ని నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువసేపు మరిగిస్తే.. శరీరంలోకి చేరిన ఐరన్ ను శరీరం గ్రహించలేకపోతున్నట్లు గుర్తించారు. ఎక్కువగా మరిగించిన ‘టీ’ తాగితే జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ‘టీ’ని అతిగా మరిగిస్తే అన్ని పోషకాలు పోతాయంట. అలాగే ఎక్కువసేపు మరగించడం వల్ల పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి పోతాయంట. ఇలా అన్ని రకాల పోషకాలను కోల్పోయిన ‘టీ’ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ‘టీ’ನಿ 3 నుంచి 5 నిమిషాలే మధ్యే మరిగించడం మంచిదని నిపుణుಲು అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.