Home » 5జీ స్పెక్ట్రమ్ వేలం ఎట్టకేలకు నేడు జరగనుంది

5జీ స్పెక్ట్రమ్ వేలం ఎట్టకేలకు నేడు జరగనుంది

by Shalini D
0 comment

5జీ స్పెక్ట్రమ్ వేలం అంటే దేశంలో 5జీ సేవలను అందించేందుకు కేటాయించిన వైర్‌లెస్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ల కోసం జరిగే వేలం. ఈ వేలం ద్వారా టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను సంపాదించుకోవచ్చు.
5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా 4జీ కంటే 10 రెట్లు వేగంగా డేటా సేవలు అందించే వీలుంటుంది. కేంద్ర కేబినెట్ ఈ వేలానికి ఆమోదం తెలిపింది. జూలై 2022 నాటికి ఈ వేలం పూర్తి కానుంది.

గతంలో రెండుసార్లు వాయిదా పడిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ఎట్టకేలకు నేడు జరగనుంది. ₹96,317.65 కోట్ల విలువైన ఎయిర్‌వేవ్స్‌ను వేలం వేసి నికరంగా ₹10వేలకోట్లు రాబట్టాలని కేంద్రం భావిస్తోంది. 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz బ్యాండ్లకు వేలం జరగనుంది. ఈ స్పెక్ట్రమ్‌కు 20ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 10ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్‌ను సంస్థలు ట్రేడ్, లీజ్ లేదా సరెండర్ చేయొచ్చు.

నేడు జరగనున్న 5జీ వేలానికి టెలికాం సంస్థలు పెద్దగా ఆసక్తి కనబరచట్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సరిపడా 5జీ బ్యాండ్లు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేంద్రానికి సంస్థలు చేసిన ఎర్నెస్ట్ డిపాజిట్ 2022తో పోలిస్తే 79-86% తక్కువ. జియో ₹3వేలకోట్లు, ఎయిర్‌టెల్ ₹1,050కోట్లు, Vi ₹300 కోట్లు కేటాయించాయి. ₹96,320cr విలువైన వేలంలో 13% (₹12,500) మాత్రమే సంస్థలు కొనుగోలు చేయనున్నట్లు అంచనా.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.

You may also like

Leave a Comment