పల్లవి:
గాలిలోన దీపం వోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్యా..
అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడలనుదయ్యా!
చరణం 1
గాలిలో దీపం వోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్యా..
అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడలనుదయ్యా!
నా మనసులోన మణికంట నీ రూపము నిలుపుకుంటినయ్యా..

నా కంఠంలో ఈ జీవమున్నంతవరకు నీ సేవ జేతునయ్యా!
గాలిలోన దీపం వోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్యా..
అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడలనుదయ్యా!
చరణం 2
కన్నతల్లి తండ్రి కన్నీళ్లకు నేను కారణమైతిని..
కాస్తనైనా వాళ్ళ ప్రేమను నోచని పాపిష్టినైతిని!

తల్లి తండ్రి లేనిది నేను లేనని తెలుసుకున్నాను..
నా రెండు కాళ్ళు నడవని రోజు ఉందని తెలియదు నాకు..
నీ కొండకు నడిచి రావాలనున్నది స్వామి అయ్యప్ప..

నీ భక్తుడనయ్యే భాగ్యము నీయవ స్వామి మణికంట!
గాలిలోన దీపం వోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్యా..
అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడలనుదయ్యా!
చరణం 3
ధనము ఉన్నదని మదముతోని ధర్మమన్నదే మరిచితిని..
వాళ్ళను వీళ్ళను బాధపెట్టి పైస కరువుల్లో పడిపోతిని!
ధనము ఉన్నదని మదముతోని ధర్మమన్నదే మరిచితిని..
వాళ్ళను వీళ్ళను బాధపెట్టి పైస కరువుల్లో పడిపోతిని..
ఏది గొప్పది కాదని నేను కండ్లు తెరుచుకుంటినయ్యా..
నాది నీది నువ్వు నేనని భేదము మరిచితి నయ్యా..
ఏది శాశ్వతము కాదని నాది అన్నది నాతోడు రాదని..

నేను ఉన్నన్ని రోజులు ఓపిరి అది లేకుంటే చివరికి ఆవేరి!
గాలిలోన దీపం వోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్యా..
అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడలనుదయ్యా!
చరణం 4
అల్లంత దూరాన ఆ ఐదు కొండల్లో వెలిసిన బాలునివి..
అల్లాడిపోతున్న నా చిన్ని గుండెల్లో ఈ భార మోయనివి!
అల్లంత దూరాన ఆ ఐదు కొండల్లో వెలిసిన బాలునివి..
అల్లాడిపోతున్న నా చిన్ని గుండెల్లో ఈ భార మోయనివి..
తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించే దేవుడవయ్యా..
తులసి మాలను నల్లని బట్టలు వేసుకొని కొలుతునయ్యా..
నీవు విద్య నేర్చినా నీ గురుబాలుల కంటి చూపు మాటలిస్తీవి..

నిన్ను నమ్ముకున్న ఈ భక్తునికి నడగనిచ్చి నడిపించు వేడితి!
గాలిలోన దీపం వోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్యా..
అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడలనుదయ్యా!
Read also: siddi ma ganapathi song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి .