Evare Nuvve lyrics Im Game

Evare Nuvve lyrics – I’m Game | ఎవరే నువ్వే

by Lakshmi Guradasi

Song Credits :

పాట : ఎవరే నువ్వే (Evare Nuvve)
చిత్రం : (I’m Game)
గాయకులు: అర్మాన్ మాలిక్ (Armaan Malik)
సంగీత దర్శకులు: జేక్స్ బిజోయ్ (Jakes Bejoy)
గీత రచయితలు: సనారె (Sanare)
నటీనటులు: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), కయదు లోహర్ (Kayadu Lohar),

Evare Nuvve lyrics – I’m Game in Telugu

ఎవరే నువ్వే నాకేమవుతావే
అది అడిగేలోపే మనసే దోచావే
వెలుగే లేని నీడై నేనుంటే
నా ఎదలోకొచ్చి రంగులు పూసావే
పరువంలోన ప్రేమ పూరించావే
హృదయం లోన పూలు పూయించావే
ప్రాణంలో ఆనందం పెంచావే

చందమామవే నువ్ చందమామవే
నా చీకటి లోకంలో
చల్లగాలివే నువ్ చల్లగాలివే
నా వేసవి దారుల్లో
చెంత చేరావే నా చెంత చేరావే
ఇంకెంతని అడగాలో
నీ కోసం చోటుందే గుండెల్లో

ఎవరే నువ్వే నాకేమవుతావే
అది అడిగేలోపే మనసే దోచావే

నిన్నే కలిశాక నేనే, నవ్వే కలిసిందే నన్నే
నువ్వే ఇక ప్రాణం నాకే నన్నే విడిపోకే
వరమై వరించెనే నీ జతే
దిగులై తలొంచెను చేదు రాతే
పెదవులు తొడగని నగవుల నగ నువ్వా
తలపుని తడిపిన తొలకరి చినుకువా
అలిసిన మనసుని కదిపిన అలజడివా

చందమామవే నువ్ చందమామవే
నా చీకటి లోకంలో
చల్లగాలివే నువ్ చల్లగాలివే
నా వేసవి దారుల్లో
చెంత చేరావే నా చెంత చేరావే
ఇంకెంతని అడగాలో
నీ కోసం చోటుందే గుండెల్లో

ఎవరే నువ్వే నాకేమవుతావే
అది అడిగేలోపే మనసే దోచావే

ఇంద్రధనుసుల విరిసే నిన్ను చూడగ మనసే
తేనె వర్షం కురిసే తాకి చెలిలా నీ స్పర్శే
కోటి వీణల స్వరమే నువ్వు పలికితే భాషే
నిదురపోయినా విడదే నన్ను తెలుసా నీ ధ్యాసే

ఉండిపోయిలా ఉండిపోయిలా
నీ పక్కనుంటే చాలు ఉండిపోయిలా
వెండి వెన్నెలా వెండి వెన్నెలా
శ్వాసలాగా మారి నిండిపోయిలా
కొత్త జన్మలా కొత్త జన్మలా
నిన్ను చేరినాకే పుట్టినానిలా
కంటి రెప్పలా కంటి రెప్పలా
దాచుకోనా రెండు కళ్ళులా

ఎవరే నువ్వే నాకేమవుతావే

Evare Nuvve lyrics – I’m Game in English

Evare Nuvve Naakemavuthaave
Adi Adigeelope Manase Dochaave
Veluge Leni Needai Nenunte
Naa Yedhalokocchi Rangulu Poosaave
Paruvamlona Prema Poorinchaave
Hrudayam Lona Poolu Puyinchaave
Praanamlo Aanandam Penchaave
Chandamaamave Nuv Chandamaamave

Naa Cheekati Lokamlo
Challagaalive Nuv Challagaalive
Naa Vesavi Daarullo
Chentha Cheraave Naa Chentha Cheraave
Inkenthani Adagaalo
Nee Kosam Chotundhe Gundello

Evare Nuvve Naakemavuthaave
Adi Adigeelope Manase Dochaave

Ninne Kalisake Nene, Navve Kalisindhe Nanne
Nuvve Ika Praanam Naake Nanne Vidipoke
Varamai Varinchene Nee Jathe
Digulai Thalonchenu Chedhu Raathe
Pedhavulu Thodagani Nagavula Naga Nuvvaa
Thalapuni Thadipina Tholakari Chinukuvaa
Alisina Manasuni Kadipina Alajadivaa

Chandamaamave Nuv Chandamaamave
Naa Cheekati Lokamlo
Challagaalive Nuv Challagaalive
Naa Vesavi Daarullo
Chentha Cheraave Naa Chentha Cheraave
Inkenthani Adagaalo
Nee Kosam Chotundhe Gundello

Evare Nuvve Naakemavuthaave
Adi Adigeelope Manase Dochaave

Indradhanusula Virise Ninnu Choodaga Manase
Thene Varsham Kurise Thaaki Chelilaa Nee Sparshe
Koti Veenala Swarame Nuvvu Palikithe Bhashe
Nidurapoyinaa Vidade Nannu Telusaa Nee Dhyaase

Undipoyilaa Undipoyilaa
Nee Pakkanunte Chaalu Undipoyilaa
Vendi Vennelaa Vendi Vennelaa
Shwaasalagaa Maari Nindipoyilaa
Kotha Janmalaa Kotha Janmalaa
Ninnu Cherinaake Puttinaanilaa
Kanti Reppalaa Kanti Reppalaa
Daachukonaa Rendu Kallulaa

Evare Nuvve Naakemavuthaave

Read also: chitti chitti cheema lyrics aakasamlo oka tara

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like