Prema Swaramulalo Song lyrics 24

ప్రేమ స్వరములలో (Prema Swaramulalo) పాట లిరిక్స్ | 24

by Lakshmi Guradasi

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే

కోరికలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే
అతిధులెవరు ఎదురు పడని ప్రేమ తిధులు మనవే
అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే
చరితల కాగితాల లోన చదవలేని ప్రేమనే
నీలో చదివా ఈ క్షణాలలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే

హృదయ గళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో
ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

In English Version:

Prema parichayame daiva darshaname
Prema swaramulalo daiva smaranamule
Adi telisindi tolisari nee prematho
Madi munigindi nee premalo

Prema parichayame daiva darshaname
Prema adugulalo devatarchanale

Korkelasalu korukonani prema tapasu manadile..
Atidulevaru yedurupadani prema tidulu manave..
Amrutamulu yegasipadina prema nadhulu manave
Charitala kaagitaalalona chaduvuleni premane
Neelo chadiva ee kshanam

Prema parichayame daiva darshaname
Prema adugulalo devatarchanale

Hrudaya galamu paadutunna prema geethi manadile
Kanula kalamu raasukunna prema lekha manade
Pedavi pramidha panchutunna prema jyothi manade
Manusula oohalona saitham vundaleni prematho
Yetuke vunna ee kshanalalo

Prema parichayame daiva darshaname
Prema adugulalo devatarchanale

Adi telisindi tolisari nee prematho
Madi munigindi nee premalo

Prema parichayame daiva darshaname
Prema swaramulalo daiva smaranamule…
Adi telisindi tolisari nee prematho
Madi munigindi nee premalo

Prema parichayame daiva darshaname

_________________

Song Credits:

పాట: ప్రేమ స్వరములలో (Prema Swaramulalo)
చిత్రం : 24 (2016)
గానం : హృదయ్ గట్టాని (Hriday Gattani), చిన్మయి (Chinmayi)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
సంగీతం: A. R. రెహమాన్ (A. R. Rahman)
దర్శకుడు: విక్రమ్ కుమార్ (Vikram Kumar)
నటుడు: సూర్య (Suriya), సమంత (Samantha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like