vaddu vaddu ravana song lyrics

వద్దు వద్దు రావణా వారి తోటి యుద్ధము లిరిక్స్

by Lakshmi Guradasi

పల్లవి:-
వద్దు వద్దు రావణా వారి తోటి యుద్ధము
వారి సీతను వారీ కిచ్చి వారి తోటి
సాగనంపైయో రావణా
వారి తోటి యుద్ధమొద్దయో రావణా

చరణం:-1
ఆజాను బహుడంట నీలిమేగ శ్యాముడంట
కౌసల్యతనయుడంట సుమీత్ర పుత్రుడు అంట
నల్లా నల్లని వాడు ఎర్రా ఎర్రని వాడు
రామ లక్ష్మణ లొచ్చినారయ్యో రావణా
సీత జాడ కొచ్చినారయ్యో రావణా
వారి సీతను వారికిచ్చి వారి తోటి
సాగనంపైయో రావణా

చరణం:-2
ధీరాది దిరుడంట వీరాంజనేయుడంట
వాణరా వీరుడంట వాయు కుమారుడంట
బుజ్జి బుజ్జి మూతి వాడు మారేడంత తోక వాడు
ఆంజనేయుడొచ్చినాడైయో రావణా
సీత జాడ కొచ్చినారయ్యో రావణా
వారి సీతను వారికిచ్చి వారి తోటి
సాగనంపైయో రావణా

చరణం:-3
సీతమ్మను అపహరించి చెరపట్ట చూసినావు
ధర్మాన్ని విడనాడి చెడు క్యాతి తెచ్చుకోకు
నరుడే నారాయణుడు శ్రీరామ చంద్రుడంట
రామ లక్ష్మణ లొచ్చినారయ్యో రావణా
సీత జాడ కొచ్చినారయ్యో రావణా
వారి సీతను వారికిచ్చి వారి తోటి
సాగనంపైయో రావణా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like