జగదానంద కారకా
ఆ … ఆ …జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
మంగలకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాక
నీ పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
సార్వభౌమునిగ పూర్ణకుంభములె
స్వాగతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే
రాగమాల పాడే
నాల్గు వేదములు తన్మయత్వమున
జలధి మారు మ్రోగే
న్యాయ దేవతే శంఖమూదగా
పూలవాన కురిసె
రాజమకుటమే వొసగెలె
నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం
పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్షకి
పరవసించె పొయే
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
రామ పాలనము కామధేనువని
వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని
జలధి బోధ చేసే
రామ దర్షనము జన్మ ధన్యమని
రాయి కూడ తెలిపే
రామ రాజ్యమె పౌరులందరిని
నీతి బాట నిలిపే
రామ మంత్రమె తారకం
భహు శక్తి ముక్తి సందాయకం
రామ నామమె అమృతం
శ్రీ రామ కీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే లొకరక్షయని
అంతరాత్మ పలికే
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
మంగలకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాక
నీ పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
In English Version:
Jagadaananda Kaarakaa
Aa… Aa… Jaya Janaki Praana Naayakaa
Jagadaananda Kaarakaa
Jaya Janaki Praana Naayakaa
Shubha Swaagatam Priya Paripaalakaa
Jagadaananda Kaarakaa
Jaya Janaki Praana Naayakaa
Shubha Swaagatam Priya Paripaalakaa
Mangalakaramou Nee Raaka
Dharmaniki Vedika Avugaaka
Maa Jeevaname Ika Paavanamougaaka
Nee Paalana Shreekaramougaaka
Sukha Shaantulu Sampadalidugaaka
Nee Raajyamu Prema Sudhaamayamougaaka
Jagadaananda Kaarakaa
Jaya Janaki Praana Naayakaa
Shubha Swaagatam Priya Paripaalakaa
Saarvabhoumuniga Poornakumbhamule
Swaagataalu Palike
Raajyamelamani Dharma Devate
Raagamaala Paade
Naalugu Vedamulu Tanmayatvamuna
Jaladhi Maaru Mroge
Nyaaya Devate Shankhamoodagaa
Poolavaana Kurise
Raajamakutame Vosagele
Navaratna Kaanti Neeraajanam
Sooryavamsha Simhaasanam
Pulakinchi Chese Abhivandanam
Saamraajya Lakshmiye Paada Sparshaki
Paravasinche Poye
Jagadaananda Kaarakaa
Jaya Janaki Praana Naayakaa
Shubha Swaagatam Priya Paripaalakaa
Jagadaananda Kaarakaa
Jaya Janaki Praana Naayakaa
Shubha Swaagatam Priya Paripaalakaa
Raama Paalanamu Kaamadhenuvani
Vyoma Seema Chaate
Raama Shaasanamu Tirugulenidani
Jaladhi Bodha Chese
Raama Darshanamu Janma Dhanyamani
Raayi Kooda Telipe
Raama Raajyame Pourulandharini
Neeti Baata Nilipe
Raama Mantrame Taarakam
Bahu Shakti Mukti Sandaayakam
Raama Naamame Amrutam
Sri Raama Keertanam Sukrutam
Ee Raamachandrude Loka Rakshayani
Antaraatma Palike
Jagadaananda Kaarakaa
Jaya Janaki Praana Naayakaa
Shubha Swaagatam Priya Paripaalakaa
Jagadaananda Kaarakaa
Jaya Janaki Praana Naayakaa
Shubha Swaagatam Priya Paripaalakaa
Mangalakaramou Nee Raaka
Dharmaniki Vedika Avugaaka
Maa Jeevaname Ika Paavanamougaaka
Nee Paalana Shreekaramougaaka
Sukha Shaantulu Sampadalidugaaka
Nee Raajyamu Prema Sudhaamayamougaaka
Jagadaananda Kaarakaa
Jaya Janaki Praana Naayakaa
Shubha Swaagatam Priya Paripaalakaa
__________________
Song Credits:
పాట పేరు: జగదానంద కారక (Jagadananda karaka)
చిత్రం: శ్రీ రామరాజ్యం (Sri Rama Rajyam)
గాయకులు: S.P. బాల సుబ్రహ్మణ్యం గారు (S.P. Bala subramanyam garu), శ్రేయ గోషల్ గారు (Goshal garu)
గీతరచయిత: జొన్నవిత్తుల గారు (Jonnavittula garu)
స్వరకర్త: ఇళయరాజా గారు (Illayaraja garu)
దర్శకుడు: బాపు గారు (Bapu garu)
See Also plz click on this: seetha-seemantham-song-lyrics
rama-rama-ane-raja-mandiram-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
