Home » రెండు జడల జమున (Rendu Jadala Jamuna) folk song lyrics

రెండు జడల జమున (Rendu Jadala Jamuna) folk song lyrics

by Lakshmi Guradasi
498 views
Rendu Jadala Jamuna song lyrics Madhuri Rathod

జారుడు బండాల కాడ జల్లున కురిసేనే వాన
జారుడు బండాల కాడ జల్లున కురిసేనే వాన
వస్తానని రాకపోతే రంది గుందమ్మో.. రెండు జడల జమున
ముద్దిస్తానని ఇయ్యకపోతే బాధ గుందమ్మో.. జాజి పూల జమున

ఊడల దిబ్బల మీద ఉరుమే ఉరిమింది పిల్లగా
ఊడల దిబ్బల మీద ఉరుమే ఉరిమింది పిల్లగా
జోరు వానకు నేను తడిసిపొతిరో.. రాయపూరు రమణ
వద్దామంటే పానం బాగాలేదురో.. నాయి ముద్దుల రమణ

అరె ఊగే నడుము.. వెయ్యనా ఓ దరువు
పొంగే సొగసు.. తీర్చవే నా కరువు
వస్తానని నువ్ వస్తానని
వస్తానని రాకపోతే రంది గుందమ్మో.. రెండు జడల జమున
ముద్దిస్తానని ఇయ్యకపోతే బాధ గుందమ్మో.. జాజి పూల జమున

పెళ్ళికి పుస్తెలు కొన్న, నడుముకు నకిలేసు కొన్న
పెళ్ళికి పుస్తెలు కొన్న, నడుముకు నకిలేసు కొన్న
నీ చేతికి బంగారు గాజులు తెస్తే.. రెండు జడల జమున
చెయ్యి ఇచ్చినావు రాలేదు ఎందుకే పిల్లో.. జాజి పూల జమున

నాది మాలోళ్ల వాడ, నీది కాపోళ్ల వాడ
నాది మాలోళ్ల వాడ, నీది కాపోళ్ల వాడ
మన ఇద్దరికీ జంట కుదరదు పిల్లగొ.. రాయపూరు రమణ
మన ఊరోళ్ళు అస్సలు ఒప్పరు పిల్లగొ.. నాయి ముద్దుల రమణ

అరె ఏందే కులము ఎక్కడిది మతము
నిన్నే వదలను కట్టుకునే వరకు
వస్తానని నువ్ వస్తానని
వస్తానని రాకపోతే రంది గుందమ్మో.. రెండు జడల జమున
ముద్దిస్తానని ఇయ్యకపోతే బాధ గుందమ్మో.. జాజి పూల జమున

నీ బుగ్గ మీద సుక్క, నీ నుదటి మీద బొట్టు
నీ బుగ్గ మీద సుక్క, నీ నుదటి మీద బొట్టు
ఎప్పటికి నిన్నంటుకొని ఉంటనే.. రెండు జడల జమున
నా గుండెలో అందాల గూడు కడితినే.. జాజి పూల జమున

నువ్వంటే ఇష్టమున్న నీ మీదే ప్రేమ ఉన్న
నువ్వంటే ఇష్టమున్న నీ మీదే ప్రేమ ఉన్న
నీతోనే పెళ్లంటే భయమురా పిల్లగొ.. రాయపూరు రమణ
నేనింకా సిన్నదాన్ని వదలరా పిల్లగొ.. నాయి ముద్దుల రమణ

ఎహే ఏందే భయము నేనే నీ ధైర్యము
రాయే పోదాము చల్ ఎవడొస్తాడో చూద్దాము
వస్తానని ఓ పిల్ల వస్తానని
వస్తానని రాకపోతే రంది గుందమ్మో.. రెండు జడల జమున
ముద్దిస్తానని ఇయ్యకపోతే బాధ గుందమ్మో.. జాజి పూల జమున

నెత్తిన నిన్ను పెట్టుకున్న, మనసున నిన్ను నింపుకున్న
నెత్తిన నిన్ను పెట్టుకున్న, మనసున నిన్ను నింపుకున్న
నువ్ లేక నా పానం చిన్నబోయెనే.. రెండు జడల జమున
నీ మీదే నా మనాది మరువను పిల్లో.. జాజి పూల జమున

పోచవ్వకు మొక్కుకున్న పొలిమేర దాటుతున్న
పోచవ్వకు మొక్కుకున్న పొలిమేర దాటుతున్న
ఎప్పటికి నన్నింకా వదలకు పిల్లగొ.. రాయపూరు రమణ
ప్రతి జన్మకి నా సెయ్యిని అందుకో పిల్లగొ.. నాయి ముద్దుల రమణ

ఏదేమైనా నువ్వే నా మైనా
ఏడడుగులు ఎద్దాం ఇకనైనా
వస్తానని జమున వస్తానని
వస్తానని మాట ఇచ్చి వచ్చిందమ్మో.. రెండు జడల జమున
ముద్దిస్తానని ఊరించి ఇచ్చిందమ్మో.. జాజి పూల జమున

వస్తానని మాట ఇచ్చి వచ్చిందమ్మో.. రెండు జడల జమున
ముద్దిస్తానని ఊరించి ఇచ్చిందమ్మో.. జాజి పూల జమున

_______________________

Song Credits:

సాంగ్ : రెండు జడల జమున (Rendu Jadala Jamuna)
నటీనటులు: మాధురీ రాథోడ్ (Madhuri Rathod) – రాజేష్ జాగ్వార్ (Rajesh Jaguar)
దర్శకుడు : విశ్వ పరిష్ (Vishwa Parish) – జి.వి.ప్రవీణ్ కుమార్ (G.V.Praveen Kumar)
సంగీతం: మహిమదన్ (Mahimadan)
సాహిత్యం: అనిత నాగరాజు (Anitha Nagaraju)
గాయకులు : బొడ్డు దిలీప్ (Boddu Dilip) – ప్రభ (Prabha)
నిర్మాత: బి గిరిజ (B Girija)

See Also plz click on this: ulakadaye-palakadaye-song-lyrics-indravati-chauhan

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.