నా తల్లివి నీవే నా తండ్రివి నీవే
నా ఉచ్వాస నిశ్వాస ఊపిరి నీవే
నా బంధము నీవే అనుబంధము నీవే
భవ భావ బంధ సంబంధము నీవే
ఈ అవని మురిసెనో త్రినేత్రుని శివరాత్రికై
నయానందమాయెనో నీలకంఠ నీ పూజకై
ధరణి తానమాడెనో తలనీలాల తండ్రికై
బిల్వ దళమే పూసేనో పరమేశ నీ పూజకై
నా తల్లివి నీవే నా తండ్రివి నీవే
నా ఉచ్వాస నిశ్వాస ఊపిరి నీవే
నా బంధము నీవే అనుబంధము నీవే
భవ భావ బంధ సంబంధము నీవే
నీ పేరు ఏందయ్యా, నీ ఊరు ఏదయ్యా
ముల్లోకాలను ఏలే ముక్కంటి నీవయ్యా
నీ ప్రేమ ఏందయ్యా ఆ కోపమెందయ్యా
నీ చల్లని చూపు నీడల బతుకుతామయ్యా
ఎండి కొండలు యేలేటి జంగమా
ఎవరయ్యా నువ్వు విబూధి లింగమా
కన్నా తండ్రివై మమ్ము కాపాడయ్యా
సావు పుట్టుకలు నీ చేతే దయ
నిల్లువెల్ల కళ్ళు నీకు నీ లీలలు చిత్రమయ్యా
నా తల్లివి నీవే నా తండ్రివి నీవే
నా ఉచ్వాస నిశ్వాస ఊపిరి నీవే
నా బంధము నీవే అనుబంధము నీవే
భవ భావ బంధ సంబంధము నీవే
యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న
నాలుగు దిక్కులు నీవే ఓ నంది వాహన
కైలాస వాసుడా త్రిసులదారుడా
కంఠాన నల్ల నాగు ఓ నాగ భూషణ
కొప్పున మొస్తివే తల్లి గంగనే
యదలో కాస్తివే తల్లి ఆ గౌరమ్మనే
ఉపసముందుమే పూజలు నీకయ్యా
గండాలు దాటని గండదీపమేనయ్యా
అయినోళ్లు లేకపోయిన అందరికి సుట్టమేనయ్యా
నా తల్లివి నీవే నా తండ్రివి నీవే
నా ఉచ్వాస నిశ్వాస ఊపిరి నీవే
నా బంధము నీవే అనుబంధము నీవే
భవ భావ బంధ సంబంధము నీవే
_____________________
Song Credits:
సాంగ్ : నా తల్లివి నీవే నా తండ్రివి నీవే
సంగీత దర్శకుడు – ఇంద్రజిత్ (Indrajitt)
సాహిత్యం-గాయకుడు – దర్శకత్వం – దిలీప్ దేవగన్ (Dilip Devgan)
నటీనటులు – దిలీప్ దేవగన్ (Dilip Devgan), జగదీష్ లావణ్య (Jagadeesh Lavanya)
See Also plz click on this : shri-shaila-vasuda-lyrics-hanumanth-yadav
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
