Home » ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా | Evariki Evarayya eswara song lyrics

ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా | Evariki Evarayya eswara song lyrics

by Lakshmi Guradasi
1.6K views
evariki evarayya eswara song lyrics

ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా
మరు జన్మ రాకుండా చూడరా
నీ దయ ఉంటె చాలయ హరహర
నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా
నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా

ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా

ఈ కనులు తెరవగా జననం
ఈ కనులు మూస్తేనే మరణం
ఈ కనులు తెరవగా జననం
ఈ కనులు మూస్తేనే మరణం
రెప్పపాటయ్య ఈ జీవనం
విధి మార్చ తరమా బ్రహ్మకైనా
పరమేశ్వరా… ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ
పరమేశ్వరా…కరుణించ రావా
హర హరా మహాదేవ శంభో శంకర
హర హరా మహాదేవ శంభో శంకర

నేను నేననే అహము
నాది నాదనే స్వార్ధం
నేను నేననే అహము
నాది నాదనే స్వార్ధం
కలుషితంబయ్యె ఈ జీవితం
ఇక చాలునయ్య ఈ నాటకం
లయకారకా ..ఆ ఆ. ..ఆ ఆ..ఆ ఆ..
లయకారక ఇక చాలిక
అర్ధనారీశ్వర గౌరీశంకర
అర్ధనారీశ్వర గౌరీశంకర

ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా
ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా

మరు జన్మ రాకుండా చూడరా
నీ దయ ఉంటె చాలయ హరహర
నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా
నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా

ఎవరికి ఎవరయ్య ఈశ్వర
ఎవరుంటేనేమయ్య ఈశ్వర
ఎవరుంటేనేమయ్య ఈశ్వర

See Also plz click on this: saranam-saranamayya-shankara-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.