Home » కలగన్నానే ఎల్లమ్మో (kala gannane yellamma) లిరిక్స్

కలగన్నానే ఎల్లమ్మో (kala gannane yellamma) లిరిక్స్

by Lakshmi Guradasi
1.4K views
kala gannane yellamma song Lyrics

కలగన్నానే ఎల్లమ్మో నేను కలగన్నానే ఎల్లమ్మ
నా కంటికి కనిపించినట్టు ఇంటికి నువ్వు వచ్చినట్టు కలగన్నానే ఎల్లమ్మ
పట్టు చీర కట్టుకొని ఎల్లమ్మ
పట్టా గొలుసులు వేసుకోని ఎల్లమ్మ
పెద్ద ముత్తేదువు తీరు ఎల్లమ్మ
పెద్ద బొట్టు పెట్టుకోని ఎల్లమ్మ
ఎరకల బుట్టేతుకొని ఎల్లమ్మ
ఎరక చెబుతానంటూ నా తలపే కొట్టినట్టు

కలగన్నానే ఎల్లమ్మ నేను కలగన్నానే ఎల్లమ్మ
నా కంటికి కనిపించినట్టు ఇంటికి నువ్వు వచ్చినట్టు కలగన్నానే ఎల్లమ్మ

చిలుకవంటి పలుకులతోని ఎల్లమ్మ
హంస వంటి నడకలతోనీ ఎల్లమ్మ
చిన్ని చిన్ని అడుగులేస్తూ ఎల్లమ్మ
చిన్నారి పాప రూపంలో ఎల్లమ్మ
ఇల్లంతా తిరుగుతు ఆడుకుంటున్నట్టు
ఇంకో రోజు నిన్ను కలలోచూశానమ్మా

కలగన్నానే ఎల్లమ్మ నేను కలగన్నానే ఎల్లమ్మ
నా కంటికి కనిపించినట్టు ఇంటికి నువ్వు వచ్చినట్టు కలగన్నానే ఎల్లమ్మ

గద్దే నేను వాళ్ళకాబోతే ఎల్లమ్మ
పాము దొంతులు పూజిస్తూటే ఎల్లమ్మ
దొంతుల మీద ఉన్న పాము ఎల్లమ్మ
ప్రత్యక్షమయ్యాడిన్నట్టు ఎల్లమ్మ
పడగెత్తి దీవిస్తూన్నట్టు ఎల్లమ్మ
మల్లో రోజు నీ మహిమలు కలగంటి

కలగన్నానే ఎల్లమ్మ నేను కలగన్నానే ఎల్లమ్మ
నా కంటికి కనిపించినట్టు ఇంటికి నువ్వు వచ్చినట్టు కలగన్నానే ఎల్లమ్మ

నే నడిచే దారిలోనమో ఎల్లమ్మ
చేపట్టి నడిపిస్తున్నట్లు ఎల్లమ్మ
గాలి ధూళి నాకు సోకితే ఎల్లమ్మ
కొంగుతో దిష్టి తీసినట్టు ఎల్లమ్మ
అమ్మలాగా నన్ను ఆదరించిన నీవే
బిడ్డవై మల్లి నా కడుపున పుట్టినట్టు

కలగన్నానే ఎల్లమ్మ నేను కలగన్నానే ఎల్లమ్మ
నా కంటికి కనిపించినట్టు ఇంటికి నువ్వు వచ్చినట్టు కలగన్నానే ఎల్లమ్మ

___________________

Song Credits:

పాట పేరు: కలగన్ననే ఎల్లమ్మ Kalagannane Yellamma
గానం: రమేష్ బండారి (Ramesh Bandari)
రచయిత: కుంబాల గోకుల్ Kumbala Gokul
సంగీతం: ప్రవీణ్ జాజ్ (Praveen Jazz)

See Also plz click on this: naa-pere-yellamma-song-lyrics-naga-durga

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.