Home » అమ్మగారు ఉండేది వైకుంఠం భజన పాట లిరిక్స్

అమ్మగారు ఉండేది వైకుంఠం భజన పాట లిరిక్స్

by Lakshmi Guradasi
2K views
ammagaru undedi vaikuntam song lyrics

అమ్మగారు ఉండేది వైకుంఠం
నాన్నగారు ఉండేది కైలాసం (2)
అన్నగారు ఉండేది పళనిమల
మన స్వామి వారు ఉండేది శబరిమల (2)

|| అమ్మగారు ఉండేది వైకుంఠం||

అమ్మగారినంటారు హరి హరి
నాన్నగారినంటారు శివ శివ (2)
అన్నగారినంటారు మురగ మురగ
మన స్వామివారినంటారు శరణం శరణం (2)

|| అమ్మగారు ఉండేది వైకుంఠం||

అమ్మగారిదేమో గరుడ వాహనం
నాన్నగారిదేమో నంది వాహనం (2)
అన్నగారిదేమో నెమలి వాహనం
మన స్వామివారిదేమో పులి వాహనం (2)

|| అమ్మగారు ఉండేది వైకుంఠం||

అమ్మగారికేమో ఏమో పులాభిషేకం
నాన్నగారికేమో భస్మభిషేకం (2)
అన్నగారికేమో పాలభిషేకం
మన స్వామివారికేమో నేయాభిషేకం (2)

|| అమ్మగారు ఉండేది వైకుంఠం||

అమ్మగారి ఆయుధం చక్రయుధం
నాన్నగారి ఆయుధం త్రిసూలం
అన్నగారి ఆయుధం శులాయుధం
మా స్వామి వారి ఆయుధం శరణు శరణు

|| అమ్మగారు ఉండేది వైకుంఠం||

See Also plz click on this: villali-villali-ayyappa-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.