మల్లేపూలు తెద్దామా మణికంట | Mallepulu teddama manikanta song lyrics

by Lakshmi Guradasi

మల్లేపూలు తెద్దామా మణికంటుని మెడలో వేద్దామా
ఆల్లిపూల మాలలు అయ్యప్ప మెడలో వేద్దామా
శబరిమలై స్వామినే శరణు వేడుకుందామా
శుభములిచ్చే స్వామికే పాద పూజ చేద్దామా

మల్లేపూలు తెద్దామా మణికంటుని మెడలో వేద్దామా
అల్లిపూల మాలలు అయ్యప్ప మెడలో వేద్దామా

చరణం 1
మందార పూలు తెచ్చి మణికంఠుని మెడలో వేసి
సిందూర పూల మాల సిరిగల్ల తండ్రికేసి
పాపాలు పాపుమంటూ పారిజాత మాలలేసి
పడిమెట్లనెక్కి మనం పావనమై పోదామా
పాదాలే మొక్కి మనం ధన్యులమై పోదామా

శబరిమలై స్వామినే శరణు వేడుకుందామా
శుభములిచ్చే స్వామికే పాద పూజ చేద్దామా (2)

చరణం 2
జగాలేల స్వామికి జాజి పూలు తెద్దామా
చిన్నీ మణికంటునికి చామంతి పూలు తెద్దామా
గణపతిసోదరునికి గులాబీ పూలు తెద్దామా
దండాలల్లి అయ్యప్ప స్వామి మెడల వేద్దామా
మాలాలల్లి మణికంఠ స్వామి మెడల వేద్దామా
శబరిమలై స్వామినే శరణు వేడుకుందామా
శుభములిచ్చే స్వామికే పాద పూజ చేద్దామా

మల్లేపూలు తెద్దామా మణికంటుని మెడలో వేద్దామా
అల్లిపూల మాలలు అయ్యప్ప మెడలో వేద్దామా

చరణం 3
బాల బ్రహ్మచారికి బంతి పూలు తెద్దామా
కలియుగ దైవానికి సన్నజాజులు తెద్దామా
సకల కళా రూపునికి సంపంగి పూలు తెద్దామా
దండాలల్లి దయగల్ల స్వామి మెడల వేద్దామా
మాలాలల్లి మణికంఠ స్వామి మెడల వేద్దామా

శబరిమలై స్వామినే శరణు వేడుకుందామా
శుభములిచ్చే స్వామికే పాద పూజ చేద్దామా (2)

చరణం 4
తూర్పు దేశం పోదామా తుమ్మి పూలు తెద్దామా
పడమటి దేశం పోదామా పండు మల్లెలు తెద్దామా
ఉత్తర దేశం పోదామా ఉమ్మి పూలు తెద్దామా
దక్షిణ దేశం పోదామా తామర పూలు తెద్దామా
దండాలల్లి అయ్యప్ప స్వామి మెడల వేద్దామా
శబరిమలై స్వామినే శరణు వేడుకుందామా
శుభములిచ్చే స్వామికే పాద పూజ చేద్దామా

మల్లేపూలు తెద్దామా మణికంటుని మెడలో వేద్దామా
అల్లిపూల మాలలు అయ్యప్ప మెడలో వేద్దామా

See Also plz click on this : chakkani-malle-jaji-ayyappa-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like