chudalani unnadaya ayyappa song lyrics

చూడాలని ఉన్నదయా (chudalani unnadaya) సాంగ్ లిరిక్స్, Gangaputra Narsing Rao

by Lakshmi Guradasi

పల్లవి :

చూడాలనున్నదయ చూసి తరియించు భాగ్యమయ
నిన్ను చూడాలననుకుంటే వేవేల జన్మాల భాగ్యం వెంటుండాలయ
చూడాలనున్నదయ చూసి తరియించు భాగ్యమయ

(స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప )2

చరణం : 1

ఆ శబరి గిరిపైనా
ఓం…. ఓం.. ఓం…
ఆ శబరి గిరిపైనా
నీ గర్భ గుడిలోన
నిను చేరే ఆ నీటి బిందువు కున్నంత
నీ పూజ చేసేటి పత్రం కున్నంత
నీ పాదముల చెంత పువ్వుల కున్నంత
ఆపాటి భాగ్యమ్ము మాకేదీ స్వామీ
మరు జన్మ మాకుంటే కలిగించు స్వామీ
మణికంఠ స్వామీ

(స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప )2

చూడాలనున్నదయ చూసి తరియించు భాగ్యమయ
నిన్ను చూడాలననుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ
చూడాలనున్నదయ చూసి తరియించు భాగ్యమయ

చరణం : 2

తనువున్న వరకు
ఓం…. ఓం…. ఓం…
తనువున్న వరకు
నీ కొండకొస్త
నిండైన రూపాన్ని నే చూసి వస్తా
ఒకవేళ నీ కొండ రాలేక పోతే
వృద్ధుడినై నా కంట నిను చూడకుంటే
అంతటితో ఈ జన్మ చాలించు స్వామీ
నీ పాదముల చెంత చోటివ్వు స్వామీ
మణికంఠ స్వామీ

(స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప )2

చూడాలనున్నదయ చూసి తరియించు భాగ్యమయ
నిన్ను చూడాలననుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ
చూడాలనున్నదయ చూసి తరియించు భాగ్యమయ

చరణం : 3

కనులుండి కూడా
ఓం.. ఓం… ఓం
కనులుండి కూడా
కాబోదయినాను
మంచేదో చేదుఏదో తెలియక ఉన్నాను
పాపాల పుట్టొలే పెరుగుతూ వున్నాను
ఇహలోక బంధాలలో బందీనైనాను
మోక్షాన్ని నే కోరి వచ్చాను స్వామీ
మనసున్న మా మంచి మణికంఠ స్వామీ
మన్నించు స్వామీ

(స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప )2

See Also plz click on this: skanda-jolali-song-lyrics-ramya-behara

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like