Home » స్కంద జోలాలి (Skanda Jolali) సాంగ్ లిరిక్స్ | Ramya Behara

స్కంద జోలాలి (Skanda Jolali) సాంగ్ లిరిక్స్ | Ramya Behara

by Lakshmi Guradasi
4.6K views
Skanda Jolali song lyrics Ramya Behara

నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ……
మురిపాల జోలాలీ…..
సురులకే సేనాధిపతి కీ మధురమగు లాలీ….
ముజ్జగములా లాలీ….
పార్వతీ పరమేశ తనయుడు స్వామినాధుడట….
కుమారస్వామి అట….
కృత్తికలు పాలించి పెంచిన కార్తికేయుడట….
ముద్దు బాలుడట….
నిదురకు వేలాయనట….
జోలాలి…. జోలాలి….జోలాలి….జోలాలి….

నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ…
మురిపాల జోలాలీ…..
సురులకి సేనాధిపతికీ మధురమగు లాలీ…..
ముజ్జగముల లాలీ…..

శివుని తేజం.. శిశువుగా ఇల వెలసిన కథ నీది….
సర్ప రూపున భక్తులను కాపాడు
లీల యే నీది…..
ఆరు ముఖముల జ్ఞానమూర్తిగా అవతరించేనట…..
అన్న గణపతి ముద్దుల తమ్ముడివి నీవు అట….
జోలాలి….. జోలాలి….. జోలాలి…జోలాలి….

దేవతల కాపాడ వెలసిన స్కంద జోలాలి….
సుబ్రహ్మణ్య జోలాలి…..
తారకాసుర వధను చేసిన మురుగ జోలాలి….
శరవణభవకు జోలాలి….

శూలధారీగ దృష్టులను శిక్షించి మా స్వామి…….
నీకు జోలాలి….
వల్లీ దేవసేనల ప్రియనాధుడికి లాలీ…..
దేవ జోలాలి….
షణ్ముఖుడ జోలాలి….
జోలాలి….. జోలాలి…..జోలాలి…..జోలాలి….

తల్లి పార్వతి నీకు పాడేను తీయనగు జోలాలి…..
అమ్మ గంగే పాడుతున్నది చల్లని ఒక లాలి…..
ఇహం పరములనీచ్చు గుహుడికి పాడే మరు లాలీ….
పంచభూతములన్నీ పాడెను పరమభక్తితో లాలీ….
జోలాలి…. జోలాలి…. జోలాలి…..జోలాలి….

నెమలివాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ….
మురిపాల జోలాలీ….
సురులకే సేనాధిపతి కీ మధురమగు లాలీ…
ముజ్జగముల లాలీ….
పార్వతీ పరమేశ తనయుడు స్వామినాధుడట …..
కుమార స్వామి అట…
కృత్తికలు పాలిచ్చి పెంచిన కార్తికేయుడట….
ముద్దు బాలుడట….
నిదురకు వేలాయనట…..
జోలాలి…… జోలాలి…… జోలాలి…..జోలాలి…..

___________________

Song Credits:

సాంగ్: స్కంద జోలాలి (Skanda Jolali)
సంగీతం – కార్తీక్ బి కొడకండ్ల (Karthik B kodakandla)
సాహిత్యం – కృష్ణవేణి మల్లవజ్జల (Krishnaveni Mallavajjala)
గాయని – రమ్య బెహరా (Ramya Behara),
AI కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ & డైరెక్షన్ – లక్ష్మణ్ మురారిశెట్టి (Laxman Murarishetty)

See Also plz click on this : venkata-ramana-thandri-venkata-ramana-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.