భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయను చూచినప్పుడు (2)
భయము చెందకు నీకు
జయము దయచేయువాడు (2)
దేవుడే యెహోవయున్నాడు నీ సాయమునకు
దేవుడే యేసన్నయున్నాడు (2) ||భయము ||
1.
చెరసాలలో వేసినా
తమ దేహమంతా గాయాలతో నిండినా (2)
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
భూకంపం కలుగలేదా
ఓ భక్తుడా… భూకంపం కలుగలేదా (2)
భక్తులు ముగ్గురు చెర నుండి
విడుదల కాలేదా (2) ||భయము ||
2.
బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు
బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా… నాల్గవ వాడు ఉండలేదా (2) ||భయము ||
3.
ఆస్థి అంతా పోయినా
తన దేహమంతా కురుపులతో నిండినా (2)
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా… అని యోబు పలుక లేదా (2) ||భయము ||
Chorus
భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయను చూచినప్పుడు (2)
భయము చెందకు నీకు
జయము దయచేయువాడు (2)
దేవుడే యెహోవయున్నాడు నీ సాయమునకు
దేవుడే యేసన్నయున్నాడు (2) ||భయము ||
See Also plz click on this: bethlehemulo-sandadi-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ని చూడండి.
