రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ “2”
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగివచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయేనే హోయ్..
||రారాజు||
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండుగ
సుక్కల్లో సంద్రుడల్లే చూడసక్కనోడంట
పశువులను పాకలోన ఆ పసిబాలుడంట చెరగని స్నేహమై..ఓ…ఓ..ఓ..
||రారాజు||
2.మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా
అందరికి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినడంట
వరముగా చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై…ఓ…ఓ..ఓ..
||రారాజు||
See Also plz click on this: vinnara-vinnara-subhavaartha-subhavaartha-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
