” హమ్… హమ్… హమ్…హమ్…
ఆ..ఆ…ఆ..అ.. “2”
నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా..
లోకమంతా దూతలే తిరిగేనే శుభవార్తె చాటగా..
వచ్చినావయ్య మా కోసమే – వీడినావయ్య ఆ లోకమే “2”
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
మనసే పొంగేనే ఆనందంతో – బ్రతుకే నిండేనే సంతోషంతో “2”
1. మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము “2”
యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము
సరళమాయెను మోక్షపు మార్గము “2”
ఆ మార్గం నీవయ్యా…
మనసే పొంగేనే ఆనందంతో – బ్రతుకే నిండేనే సంతోషంతో “2”
2. పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము “2”
యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే పోల్చలేనయ్య “2”
ఆ ప్రేమ నా కోసమా…
మనసే పొంగేనే ఆనందంతో – బ్రతుకే నిండేనే సంతోషంతో “2”
నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా..
లోకమంతా దూతలే తిరిగేనే శుభవార్తె చాటగా..
వచ్చినావయ్య మా కోసమే – వీడినావయ్య ఆ లోకమే “2”
ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే
మనసే పొంగేనే ఆనందంతో – బ్రతుకే నిండేనే సంతోషంతో “2”
See Also plz click on this: seethakalam-lo-christmas-kathulatho-lyrics-revanth
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.