Ayya niyamala malatho song lyrics

అయ్యా నియమాల మాలతో (Ayya niyamala malatho) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

అయ్యా నియమాల మాలతో నిన్ను కొలిచిన నిజము తెలిసేనయ్యా..
మలినమైన నా మనసు నందు యతి మధులు మొలికెనయ్యా.
దివ్య జ్యోతి అను పేరు లోన ఇక చీకటి ఉండదయ్యా..
రంగనాధుడే వెలసిన గ్రామం నిత్య వెలుగులయ్యా..
శరణ ఘోషలే పడుకొంటిని క్షణము క్షణము నిన్ను మరువకుంటిని
శరణఘోషలే పడుకొంటిని క్షణము క్షణము నిన్ను మరువకుంటిని..
గుండె నిండుగా నీదు రూపమే నింపు కొంటినయ్యా..

అయ్యా నియమాల మాలతో నిన్ను కొలిచిన నిజము తెలిసేనయ్యా..
మలినమైన నా మనసు నందు యతి మధులు మొలికెనయ్యా.

మా ఊరిలున్న మా భాగ్యలక్ష్మి కి బాధ చెప్పుకున్నా
పోచమ్మ కు బోనము చేసి మొక్కు మొక్కుకున్నా
అభయమిచ్చు ఆ ఆంజనేయుడుతో నేను వేడుకున్నా
మొక్కులన్ని ఇరుముడిన కట్టి నీ కొండ చేరుతున్నా

కరుణించి దారి చూపిస్తావో కానాల్లో మమ్ము నడిపిస్తావో

కరుణామయ కారణవాస కనుకరించవయ్య…

అయ్యా నియమాల మాలతో నిన్ను కొలిచిన నిజము తెలిసేనయ్యా..
మలినమైన నా మనసు నుండి అతి మధుర మొలికెనయ్యా..

కటిక నేలపై తుంగ చాపపై నిద్ర పోతినయ్యా
కనులు మూసిన కలల నిండా నీ దివ్య రూపమయ్యా
పడి పూజల నీదు రూపమే మనసు నిండేనయ్యా
పంచ గిరులను వదిలి వచ్చి మా పక్కనుందువయ్యా

కన్నె స్వామి రూపంలోనో కత్తి స్వామి రూపంలోనో

గురు స్వామి రూపంలోనో మా ముందు నిలుతువయ్యా

అయ్యా నియమాల మాలతో నిన్ను కొలిచిన నిజము తెలిసేనయ్యా..
మలినమైన నా మనసు నుండి అతి మధుర మొలికెనయ్యా..

కాలి నడకతో కొండ కొనలో నడుచి వచ్చు వేలా
ప్రతి చెట్టు పుట్టలో నీదు నామమే ప్రతిద్విచేనయ్యా
పసిపాప రూపమున పడి మెట్లపై నిన్ను చూసే వేళా
నా తనువులోని ఆణువణువూనందు ని రూపు నిండేనాయ్యా
ఏ జన్మలోన నీ ఋణముందో ఈ జన్మ లోన అది తీరిందో

ప్రతి జన్మలోను నిను కొలిచే భాగ్యం కనుకరించవయ్యా

అయ్యా నియమాల మాలతో నిన్ను కొలిచిన నిజము తెలిసేనయ్యా..
మలినమైన నా మనసు నందు యతి మధులు మొలికెనయ్యా.
దివ్య జ్యోతి అను పేరు లోన ఇక చీకటి ఉండదయ్యా
రంగనాధుడే వెలసిన గ్రామం నిత్య వెలుగులయ్యా..
శరణ ఘోషలే పడుకొంటిని క్షణము క్షణము నిన్ను మరువకుంటిని
శరణఘోషలే పడుకొంటిని క్షణము క్షణము నిన్ను మరువకుంటిని..
గుండె నిండుగా నీదు రూపమే నింపు కొంటినయ్యా.

అయ్యా నియమాల మాలతో నిన్ను కొలిచిన నిజము తెలిసేనయ్యా..
మలినమైన నా మనసు నందు యతి మధులు మొలికెనయ్యా..

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like