Home » చక్కని మల్లె జాజి (chakkani malle jaji ayyappa) సాంగ్ లిరిక్స్

చక్కని మల్లె జాజి (chakkani malle jaji ayyappa) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
1.7K views
chakkani malle jaji ayyappa song lyrics

చక్కని మల్లె జాజి పువ్వుల పరుపు వేసి…
​బంగారు ఊయల గట్టి ఊయలూపనా…

​పన్నీట చందనాలా విభూధులే చేర్చి..
​స్వామి నీకు లాల పోయించి జోల పాడనా…

​తండ్రి ఏమి నాది భాగ్యమో..నిన్ను లాలించ
మరు జన్మనైన సాగని నిన్ను సేవించ..

​చక్కని మల్లె జాజి పువ్వుల పరుపు వేసి…
​బంగారు ఊయల గట్టి ఊయలూపనా..

​లేదే శక్తి నిన్ను చేరగా నాకడ్డు చెప్ప..
​ఏమి నా పుణ్యము నీ మాల వేసే మోక్ష మొచ్చే..

​ఎంత మందికుంటుందయ్యా.. నిన్ను చేరే అదృష్టం..
​ఆనందం పొంగెనయ్యా.. నిన్ను చూసినా ఆ క్షణం..

​తండ్రి.. నిన్ను చూడంగానే కన్నీరు తన్నుకొచ్చే…
​ఒక్కసారిగా నన్ను గన్న తల్లి తండ్రులు గుర్తొచ్చే

​చక్కని మల్లె జాజి పువ్వుల పరుపు వేసి…
​బంగారు ఊయల గట్టి ఊయలూపనా..

​ఆకలేసిన తండ్రికి అరవన్నం వండి తెచ్చా..
​స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కలిపి చిన్నగా ముద్ద చేశా..

​అల్లారు ముద్దుగానే.. నీకు తినిపించు వేళా..
​నోటి నుండి జారిపడింది ఎంగిలైన చిన్ని ముద్ద..

​ఎంతగానే చేసుకున్నదే.. జన్మలో పుణ్యం..
​నీ ఎంగిలి తినే భాగ్యమొచ్చే అదియే అమృతం..

​చక్కని మల్లె జాజి పువ్వుల పరుపు వేసి…
​బంగారు ఊయల గట్టి ఊయలూపనా..

​అలసిన కన్నె స్వాములు అయ్యప్ప అని నిన్ను పిలిచే..
​అంతటనే నా స్వామి నీవు నడచి కొండ దిగి వచ్చె..

​అయ్యో కందిపోయెనయ్యా.. చిన్ని నీ పాదాలు
​వెన్న పూస రాసి నీకు చేసుకుంటా పాద సేవ

​అయ్యా నా ఆనందానికి హద్దులు లేవయ్యా
​నిన్ను నన్ను దూరం చేసే శక్తే లేదయ్యా…

​చక్కని మల్లె జాజి పువ్వుల పరుపు వేసి…
​బంగారు ఊయల గట్టి ఊయలూపనా..

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.