2.3K
కంఠం నల్లానా కనుగుడ్లు ఎర్రానా
మిల మిల మెరిసేను శిరమున శివమణి 2
నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా
నాగన్నా దిగురా సుందరి నాగన్నా
” కంఠం “
మహావిష్ణువు నీవు శేష పాన్పువు ఐయినావు
గరల కంటునికి నీవు కంఠమందు నిలిచావు
నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా
నాగన్నా దిగురా సుందరి నాగన్నా
” కంఠం “
నాగుల పంచమి నాడు నీ పుట్టకు పాలె పోసి
మ్రోక్కలు మొక్కదమయ్యా నువు దీవించరావేమయ్యా
నాగన్నా కరుణచుపరా నాగన్నా
నాగన్నా కనికరించరా నాగన్నా
” కంఠం “
పొట్టకూటికై మేము పొలము వెళితే స్వామి
దారిల కొలువైనావా నిను చూడక తొక్కేమయా
నాగన్నా కాటు వేయకురా నాగన్నా
నాగన్నా నీకు వేయి పడగులరా నాగన్నా
” కంఠం “
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
