Home » బాయిలోనే బల్లిపలికే (Bayilone Ballipalike) సాంగ్ లిరిక్స్ | Mangli

బాయిలోనే బల్లిపలికే (Bayilone Ballipalike) సాంగ్ లిరిక్స్ | Mangli

by Lakshmi Guradasi
13.4K views
Bayilone Ballipalike song lyrics Mangli

బాయిలోనే బల్లిపలికే ..
బాయిలోనే బల్లిపలికే ..
బండసారం శిలలొదిలే బాయిలోనే
ఎర్రాని మావొల్ల శేతికి ..
ఎర్రాని మావొల్ల శేతికి ..
ఏడువేలా జోడుంగురాలో ఎర్రాని

గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
ఇంపుగ శింగారించుకోని
సన్నా సన్నాని జాజులు సందేల
మోజుగ ముడుసుకోనొస్తిని

బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా

బాయిలోనే…
బాయిలోనే బల్లిపలికే ..
బాయిలోనే బల్లిపలికే ..
బండసారం శిలలొదిలే బాయిలోనే
బాజరులా బాలలంత..
బాజరులా బాలలంత..
బత్తిసా లాడంగో బాజరులా

శింతా శింతల్ల శింతపువ్వు రాలంగ
సిన్నోడ నా శెయ్యి పట్టవేమిర
ముంతా ముంతల్ల ఈతకల్లు తాగినట్టు
పానమంత నీ దిక్కె గుంజుతుందిరా

ఏగిరం లేకుండా ఇద్దరం ఇగురంగా
ఇష్టంగా ఎగిరిపోదామా
పాయిరం జంటోలే గావురం జేసుకొను
ముహూర్త బలమే అడుగుదమా

కంచె దాటంగ మంచే మీదుంగ ముద్దు
ముచ్చట్ల మునిగిపోదమా

బాయి బాయి బాయి బాయి బాయిలోనే…
బాయిలోనే బల్లిపలికే..
బాయిలోనే బల్లిపలికే..
బండసారం శిలలొదిలే బాయిలోనే
వాడకట్టు ఆడోళ్లంతా ..
ఆడకట్టు ఆడోళ్లంతా ..
సూడమెచ్చే సంబురాలో వాడకట్టు..

సందు సందుల్ల మందీ మందీల
సైగలు జెయ్యంగ సూడవేమిర
ఎన్ని దినాలు నువ్వే పానాలు
అంటు నిన్నే తలువనురా

పొడిపొడి మాటల పోరడ
నీకాడ జేరగ పట్టు వడితినిరా
పరులా కన్నూల పడక
నీ కొరకు పరుగు పరుగన వస్తినిరా

అలిమిన శీకట్ల బలిమిలేకుండా
ఆలుపు సొలుపులు తీర్చవేమిరా

బాయి బాయి బాయి బాయి బాయిలోనే…
బాయిలోనే బల్లిపలికే..
బాయిలోనే బల్లిపలికే..
బండసారం శిలలొదిలే బాయిలోనే
కంకపొదలా కొమ్మలిరిశి..
కంకపొదలా కొమ్మలిరిశి..
కొలాటా లాడంగో కంకపొదలా

గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
ఇంపుగ శింగారించుకోని
సన్నా సన్నాని జాజులు సందేల
మోజుగ ముడుసుకోనొస్తిని

బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా

బాయిలోనే……

____________________

Song Credits:

సాంగ్ : బాయిలోనే బల్లిపలికే (Bayilone Ballipalike)
దర్శకుడు – దాము రెడ్డి (Damu Reddy)
గాయకులు – మంగ్లీ & నాగవ్వ (Mangli & Nagavva)
సంగీతం – సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)
కొరియోగ్రాఫర్ – శేఖర్ వైరస్ (Shekar Virus)
గీత రచయిత – కమల్ ఎస్లావత్ (Kamal Eslavath)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.