Home » దేవుడోచ్చినాడురో చూడరా చూడరా / Devudochinaduro సాంగ్ లిరిక్స్

దేవుడోచ్చినాడురో చూడరా చూడరా / Devudochinaduro సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
2.6K views
Devudochinaduro song lyrics

దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా

దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా

ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావ.. స్వామి..
ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కోసమే వచ్చినావ

ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము
ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము
నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము
నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము

మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం.. స్వామి ..
మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం
హరిహరా తనయుడా అందరి దేవుడా
ఆపదలో ఆదుకొనే శబరిమలై నాధుడా……

దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావ.. స్వామి..
ఓ దేవా… మా దేవా…. మా కోసమే వచ్చినావ

రంగు రంగు పూలు తెచ్చి హారలే వేసినాము
రంగు రంగు పూలు తెచ్చి హారలే వేసినాము
పుట్టతేనె పాలతోటి ఫలహారము చేసినాము
పుట్టతేనె పాలతోటి ఫలహారము చేసినాము

పాదాలే కడిగేము నీ పూజలే చేసేము
పాదాలే కడిగేము నీ పూజలే చేసేము
గణపతి సోదరుడా జ్యోతీస్వరూపుడ
కార్తికేయ సోదురుడా కాంతిమలై వాసుడా……

దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావ….
ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కోసమే వచ్చినావ

పగలంతా పనిచేసి అలసిసొలసి పోయినాము
పగలంతా పనిచేసి అలసిసొలసి పోయినాము
సందెవేళ కాగానే ఆలయంబు చేరినాము
సందెవేళ కాగానే ఆలయంబు చేరినాము
ఆడేము పాడేము ఆనందమే పొందేము
ఆడేము.. స్వామి.. పాడేము.. స్వామి.. ఆనందమే పొందేము

ఎరిమేలి వాసుడా వావరకు మిత్రుడా
కరిమలై వాసుడా పంబానది బాలుడా.. …..

దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా

దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావ..
ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కోసమే వచ్చినావ
మా కోసమే వచ్చినావ
మా కోసమే వచ్చినావ
మా కోసమే వచ్చినావ
మా కోసమే వచ్చినావ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.