గంగరాజు (Gangaraju) Folk సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

గంగరాజో మొక్కి మోటరెక్కలే
హే గంగు..

పొలిమేర తొవ్వకాడ ముక్కిడి పోచంముండే
పొలిమేర తొవ్వకాడ ముక్కిడి పోచంముండే
గంగరాజో మొక్కి మోటరెక్కలే
గంగరాజో మనమెక్కి షికారెయ్యలే

బారానా పైసలుంటే బండే నా ముందరుండు
బారానా పైసలుంటే బండే నా ముందరుండు
గంగుబాయి దమ్మిడన్న లేకపాయే
గంగుబాయి నాకంత దమ్ము లేకపాయే

ఆ దుప్పల్ల నడుసుడాయే పానమంతా గాబరాయే
ఆ దుప్పల్ల నడుసుడాయే పానమంతా గాబరాయే
గంగరాజో నీడనన్న ఉంచవాయే
గంగరాజో జర్ర కోత సోచాయించవాయే

నిమ్మకు నీరెత్తినట్టు నీడపట్టు కూసోకు
నిమ్మకు నీరెత్తినట్టు నీడపట్టు కూసోకు
గంగుబాయి నీ నడక సూడ మనసయ్యిందే
గంగుబాయి నీ కులుకు చూడ అశుందే

నా అవ్వగారి ఊరిలోన మల్లన్న జాతరంట
అవ్వగారి ఊరిలోన మల్లన్న జాతరంట
గంగరాజో వరముండి వత్తనయ్యా
గంగరాజో అయితరమోలే వత్తనయ్యా

అండుకోను చేతకాదు అరుసుకోను ఎవరు లేరు
అండుకోను చేతకాదు అరుసుకోను ఎవరు లేరు
గంగుబాయి ఇడిసి నన్ను పోతవాయే
గంగుబాయి నీ తోడు విడిచి వెళ్తావాయే
ఏలే.. ఏలే ఏలే ఆహా ఏలే.. ఏలే ఏలే
ఏలే.. ఏలే ఏలే ఆహా ఏలే.. ఏలే ఏలే

గాట్లయితే ఇంటేనక పుంజు ఉండే కౌసు మీద గుంజవట్టే
ఇంటేనక పుంజు ఉండే కౌసు మీద గుంజవట్టే
గంగరాజో ఆ పుంజునన్న పట్టి తేరా
గంగరాజో పోతం చేసి పెట్టి పోరా

పోతం చెయ్య చేత రాదు పుంజు మనది కానే కాదు
పోతం చెయ్య చేత రాదు పుంజు మనది కానే కాదు
గంగుబాయి పొల్లు పొల్లు కొడతారమ్మా
గంగుబాయి మన ఇజ్జాతంతా పోతదమ్మా

అరె అంబటెలా లేచుడాయే అడ్డగోలు తిరుగుడాయే
అంబటెలా లేచుడాయే అడ్డగోలు తిరుగుడాయే
గంగరాజో నీకు అప్పెట్లా పుడతది
గంగరాజో నీ చెత్త చెదలు పట్టదిరా

గంతలేసి మాటలొద్దు మాటి మాటికి లొల్లిలొద్దు
గంతలేసి మాటలొద్దు మాటి మాటికి లొల్లిలొద్దు
గంగుబాయి నా గరుబలా బొమ్మవమ్మా
గంగుబాయి నీ మాట చెవిన పెడతానమ్మా

గంగుబాయి నా గరుబలా బొమ్మవమ్మా
గంగుబాయి నీ మాట చెవిన పెడతానమ్మా

ఏలే.. ఏలే ఏలే ఆహా ఏలే.. ఏలే ఏలే
ఏలే.. ఏలే ఏలే ఆహా ఏలే.. ఏలే ఏలే

_______________

సాంగ్ క్రెడిట్స్ :

సాంగ్ : గంగరాజు (Gangaraju)
నటీనటులు: మాధురీ రాథోడ్ & జాక్సన్ రోహిత్ (madhuri rathod & jockson rohith)
గాయకులు: వనిల్లా గుజ్జేటి & హనుమంత్ యాదవ్ (vanilla gujjeti & hanumanth yadav)
లిరిక్స్ : వనిల గుజ్జేటి (vanila gujjeti)
కో లిరిక్స్ : కోసారి శ్రీవాణి (kosari srivani)
సంగీతం: నవీన్ జె (naveen j)
కోరియోగ్రఫీ ; మను మిచల్ (manu michal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like