Neelaveni Folk song lyrics

నీలవేణి (Neelaveni) Folk సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి
నీలవేణి నీలవేణి
నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి
నీలవేణి నీలవేణి

చూడవేమి చూడవేమి చీర కట్టిన చూడవేమి
చూడవేమి చూడవేమి
చూడవేమి చూడవేమి చీర కట్టిన చూడవేమి
చూడవేమి చూడవేమి

నీ కాళ్ళ గజ్జల సప్పుడింటే
నా గుండె సప్పుడాగిపోతున్నదే
నే చీర చెంగున సదురుకుంటే
నీకు చీమ కుట్టిన సోయిరాదే
నిన్ను మోసి మురిసినమ్మా నేల నీల… ఓఓ నీల

నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి
నీలవేణి నీలవేణి

నీలవేణి నీలావేణి నిన్ను మించిన అందం ఏది
నీలవేణి నీలవేణి
ఆపవోయి ఆపవోయి అల్లిబిల్లి మాటలొయి
ఆపవోయి ఆపవోయి

నీ చీర కొంగు గాలి తగులుతనే
పాణం గాయి గాయి ఒళ్ళు కాలుతదే
నువ్వు మూడు మాటలల్ల దాటినవో
ఇంకా ఎదయ్యా మొమ్మీద గూసున్నదో
నన్ను మాయ చేసినవే నీల నీల.. ఓఓ నీల

నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి
నీలవేణి నీలవేణి

నీలవేణి నీలావేణి నిన్ను చూడక ఉండలేనోయి
నీలవేణి నీలవేణి
నన్ను చూడ ఏమున్నదోయి తన్నులైతాయ్ తోవద పోయి
నన్ను చూడ ఏమున్నదోయి

నీ చెయ్యి పట్టుకొని యెంట రానా
నీ యేలు పట్టుకొని యేలుకోన
ఎందుకయ్యా నీకు ఈ తొందర
నా చెయ్యి వుదలవోయి నువ్ ముందర
నాకు మందు పెట్టినవే నీల నీల.. ఓ ఓ నీల

నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి
నీలవేణి నీలవేణి

నీలవేణి నీలావేణి నువ్వు వరసకు మరదలువోయి
నీలవేణి నీలవేణి
తెలుసునోయి తెలుసునోయి మేనమామ కొడుకువోయి
తెలుసునోయి తెలుసునోయి

నువ్వు ఒక్క సైగ చెయ్ ఒప్పుకుంటే
నీ తోడుగుంటానమ్మా విడువనంతే
నీకు గంత ప్రేమ నా పైనే ఉంటే
కొన్ని రోజులు ఆగవోయి ఓపికుంటే
నా అలివైతావనే నీల నీల.. ఓఓ నీల

నీలవేణి నీలావేణి నెమలి కన్నుల అందాల రాణి
నీలవేణి నీలవేణి
చూడవేమి చూడవేమి చీర కట్టిన చూడవేమి
చూడవేమి చూడవేమి

________________

Song Credits:

సాంగ్ : నీలవేణి Neelaveni
సంగీతం – ఇంద్రజిత్ (Indrajitt)
సాహిత్యం – దిలీప్ దేవగన్ (Dilip Devgan)
గాయకులు – దిలీప్ దేవగన్ (Dilip Devgan) , జయశ్రీ (Jayasri)
దర్శకత్వం – కొరియోగ్రాఫర్ :– లీడింగ్ బాయ్స్ (శ్రీకాంత్) Leading Boys ( Srikanth)
నటీనటులు – జనతాబాబు (Janathabablu), మాధురి రాథోడ్ (Madhuri rathod)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like