బోలో రామభక్త హనుమాన్ కీ జై
ఓం మన్ మన్ మన్ మారుతవేగా
ఓం తత్సత్ సత్ సత్ తాపసయోగా
ఓం ఓం వానరనేతా
ఓం నమో నమ భావి విధాతా
రామలక్ష్మణా జానకీ జయము జయము హనుమాన్ కీ
భయము భయము రా లంకకీ జయమనరా హనుమాన్ కీ
చింత తీర్చెరా సీతకీ జయజయజయ హనుమాన్ కీ
ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా ఊరేగి చూపించు మహిమ
మా తోడు నీవయ్యా హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా
వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా
రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయా ఆపదకాయ చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
వాయుపుత్రా హనుమా మా వాడకొచ్చే హనుమా
రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయా ఆపదకాయ చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
జై భజరంగబలి
ఓం మన్ మన్ మన్ మారుతవేగా
ఓం తత్సత్ సత్ సత్ తాపసయోగా
ఓం ఓం వానరనేతా
ఓం నమో నమ భావి విధాతా
ఓం హనుమ ఓం రామ భజంత
ఓం కపిరాజ్య రాక్షస హంతా
తకిటతధిమిత జయ హనుమంత ఆర్త ద్రాణక రా భగవంతా
బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే
బాధలన్నీ తీర్చే దిక్కూ దైవం నీవేలే
చూసిరారా అంటేనే కాల్చి వచ్చావ్ మంటల్లే
జానకమ్మ కంట వెలిగే హారతీ నీవే
ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట
బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిపాటి ఎవరంట
సాహో మాసామీ నువ్వే హామీ యిస్తూంటే రామబాణాలు కాపాడే నంట
ఓహో మా జండాపైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మావే లెమ్మంట
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయా ఆపదకాయ చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు
లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు
తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి
రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు
శివతేజం నీ రూపమంట పవమానసుతుడంట
అంజనమ్మ ఆనందమంతా హనిమా నీ చరితంట
పాహీ శ్రీరామస్వామీ పల్లకీ నువ్వంట
నీకు బోయీలు మేమే లెమ్మంటా
యాహీ ఆకాశాలైనా చాలని ఎత్తంట
కోటి చుక్కల్లు తల్లో పూలంటా
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయా ఆపదకాయ చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా
రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయా ఆపదకాయ చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా
In English Version:
Bolo Ramabhakta Hanuman Ki Jai
Om Man Man Man Maarutavega
Om Tatsat Sat Sat Taapasayoga
Om Om Vaanaraneta
Om Namo Namo Bhaavi Vidhaata
Rama Lakshmana Janaki Jayamu Jayamu Hanuman Ki
Bhayamu Bhayamu Raa Lankaki Jayamanaraa Hanuman Ki
Chinta Teercheraa Sitaki Jay Jay Jay Hanuman Ki
Ooregi Raavayya Hanumaa Jai Hanumaa
Ooregi Choopinchu Mahima
Maa Thodu Neevayya Hanumaa Maa Hanumaa
Maa Godu Goranta Vinumaa
Vaayuputhraa Hanumaa Maavaadavayya Hanumaa
Rama Bhakta Hanumaa Maa Raksha Neeve Vinumaa
Mammu Aaduko Raavayya Aanjaneya
Aapadakaaya Choopincha Raaraa Daya
Mammu Eluko Raavayya Raakshasamaaya
Hatame Cheya Neeneeda Chaalunayaa
Vaayuputhraa Hanumaa Maavaadakochche Hanumaa
Rama Bhakta Hanumaa Maa Raksha Neeve Vinumaa
Mammu Aaduko Raavayya Aanjaneya
Aapadakaaya Choopincha Raaraa Daya
Mammu Eluko Raavayya Raakshasamaaya
Hatame Cheya Neeneeda Chaalunayaa
Jai Bhajarangabali
Om Man Man Man Maarutavega
Om Tatsat Sat Sat Taapasayoga
Om Om Vaanaraneta
Om Namo Namo Bhaavi Vidhaata
Om Hanuma Om Rama Bhajanta
Om Kapiraajya Raakshasa Hantaa
Thakita Thadhimita Jaya Hanumantha
Aarta Draanaka Raa Bhagavantha
Bantuvaina Nuvvele Bandhuvaina Nuvvele
Baadhalanni Teerche Dikkuu Daivam Neevele
Choosiraaraa Antene Kalchi Vachchaav Mantalle
Janakammaa Kanta Velige Haarati Neeve
Edalone Shreeramudanta Kanulaaraa Kanamanta
Brahmachaari Maa Brahmavanta Saripaati Evaranta
Saaho Maasami Nuvve Haami Istoonte
Rama Baanalu Kaapaade Nanta
Oho Maa Jandaapaina Andai Nuvvunte
Ramarajyaalu Maave Lemmanta
Mammu Aaduko Raavayya Aanjaneya
Aapadakaaya Choopincha Raaraa Daya
Mammu Eluko Raavayya Raakshasamaaya
Hatame Cheya Neeneeda Chaalunayaa
Manduthunna Suryunni Pandulaaga Mingavu
Lakshmanunni Gaache Cheyye Sanjeevi Maaku
Thoka Chichchu Veliginchi Lanka Gutte Ragilinchi
Raavananini Shikshinchaavu Nuvve Maathodu
Shivatejam Nee Roopamanta Pavamana Suthudanta
Anjanamma Aanandamantaa Hanimaa Nee Charitanta
Paahi Shreeramaswaami Pallaki Nuvvanta
Neeku Boyilu Maame Lemmantaa
Yaahee Aakaashaalaaina Chaalani Ethanta
Koti Chukkallu Thallo Poolantaa
Mammu Aaduko Raavayya Aanjaneya
Aapadakaaya Choopincha Raaraa Daya
Mammu Eluko Raavayya Raakshasamaaya
Hatame Cheya Neeneeda Chaalunayaa
Vaayuputhraa Hanumaa Maavaadavayya Hanumaa
Rama Bhakta Hanumaa Maa Raksha Neeve Vinumaa
Mammu Aaduko Raavayya Aanjaneya
Aapadakaaya Choopincha Raaraa Daya
Mammu Eluko Raavayya Raakshasamaaya
Hatame Cheya Neeneeda Chaalunayaa
__________________
Song Credits:
పాట: ఊరేగి రావయ్యా (Ooregi Ravayya)
ఆల్బమ్: శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam)
సాహిత్యం: వేటూరి (Veturi)
స్వరకర్త: మణి శర్మ (Mani Sharma)
సింగర్ : శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
