Home » బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ బంగారు పల్లకిలో, సాంగ్ లిరిక్స్

బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ బంగారు పల్లకిలో, సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
5.6K views
bileli vastundi rayyo durgama song lyrics

బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో

బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో

ఏటేట జాతరలంట .. ఓహో
ఎటుచూడు భక్తుల సంత .. ఆహా
డోలు దరువుల్లతోటి .. ఓహో
మాతల్లి ఊరేగింపంట .. ఆహా

ఏకాడ లేని జాతరంటే జాతరంట
జగన్మాత కనకదుర్గకూ..

బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో

పగడాల మాతల్లికంట .. ఓహో
పసుపు కుంకుమలంట . ఆహా
పచ్చ పచ్చాని గాజులంట .. ఓహో
పట్టుపీతాంబరాలంట .. ఆహా

రాజ్యాలు కలిగించే బంగారు తల్లిని
భక్తకోటి కొలవబట్టెరో

బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో

తప్పులుంటే మన్నించమంటూ .. ఓహో
తడిబట్ట స్నానాలు చేసి .. ఆహా
చక్కాని మాతల్లికేమో .. ఓహో
ఒక్కాపొద్దులు పట్టినారు .. ఆహా

లెక్కలేని భక్తులచ్చి దిక్కూ నీవేనని
మొక్కుతున్న తీరు చూడరో

బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో

సాయంకాలం సంధ్యవేళా .. ఓహో
ఊరంత దీపాల ఓల .. ఆహా
బెజవాడలో దండి మేళా .. ఓహో
కోటొక్క భక్తుల గోలా .. ఆహా

కనకదుర్గ మాతల్లి బయలెల్లి వస్తుంటే
కన్నుల పండుగయ్యో

బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో

బయలెల్లి వస్తుందిరయ్యో దుర్గమ్మ
బంగారు పల్లకిలో
దివ్యంగ వెలుగుతుందిరయ్యో మాయమ్మ
దీపాల కాంతుల్లో

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.