ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా

ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా

ఆడుకో – భలే భలే, ఆడుకో -భలే భలే భలే
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
గణగణగణ గంటలతో నువ్వాడుకో ఢమఢమఢమ డప్పులతో నువ్వాడుకో

శంఖు నాదాలతోటి నువ్వాడుకో సింహ గర్జనలతోటి నువ్వాడుకో

నువ్వాడుకో….నువ్వాడుకో….నువ్వాడుకో….ఓ… ఓ… ఓ… ఓ
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
ఎర్రాని గాజులేసి నువ్వాడుకో కాళ్ళ గజ్జాలు కట్టి నువ్వాడుకో

పట్టుచీర కట్టుకొని నువ్వాడుకో బంగారు కోవెలలో నువ్వాడుకో
పట్టుచీర కట్టుకొని నువ్వాడుకో బంగారు కోవెలలో నువ్వాడుకో
నువ్వాడుకో….నువ్వాడుకో….నువ్వాడుకో….ఓ… ఓ… ఓ… ఓ
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
మహిషాసుర మర్ధినివై నువ్వాడుకో త్రిశూలం చేతబట్టి నువ్వాడుకో

పెద్ద పులి మీద ఎక్కి నువ్వాడుకో నవ దుర్గల రూపంలో నువ్వాడుకో
పెద్ద పులి మీద ఎక్కి నువ్వాడుకో నవ దుర్గల రూపంలో నువ్వాడుకో
నువ్వాడుకో….నువ్వాడుకో….నువ్వాడుకో….ఓ… ఓ… ఓ… ఓ
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
ఆడుకో – భలే భలే , ఆడుకో -భలే భలే భలే
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
ఆడుకో దుర్గమ్మా ఆడుకోవమ్మా బెజవాడ పురములోన ఆడుకోవమ్మా
కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా – కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మా
ఇంద్రకీలాద్రిపైన ఆడుకోవమ్మా – ఇంద్రకీలాద్రిపైన ఆడుకోవమ్మా
జై బోలో దుర్గా భవాని మాతకు – జై…
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.