నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ
నీ బంగరు కాంతుల చల్లని పడగల దీవెనలీయమ్మ
అమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ
నీ బంగరు కాంతుల చల్లని పడగల దీవెనలీయమ్మ
నమ్మినవారికి నాగులచవితికి అమ్మవు నీవమ్మా
పసుపుకుంకుమ పడతులకొసగే దేవత నీవమ్మా
మా ఐదవతనముకు అభయమునిచ్చి అండగా ఉండమ్మ
చల్లని చూపుల నాగమ్మ మా పిల్లలపాపల కాయమ్మ
కరుణించు తల్లివి నీవమ్మా మాకు తోడునీడగ ఉండమ్మా
రత్నాలకాంతుల పడగల భోగభాగ్యాలనిచ్చేటి తల్లివి
పుట్టిమట్టి పుట్టలోనే తల దాచుకొందువమ్మా
చల్లని చూపుల నాగమ్మ మా పిల్లలపాపల కాయమ్మ
కరుణించు తల్లివి నీవమ్మా మాకు తోడునీడగ ఉండమ్మా
కాసినీ పాలకే మము చల్లగా కాచేవే
చలిమిడి నైవేద్యముతో చింతలు బాపేవే
పూజలందుకో శివ నాగమ్మా ఎల్లవేళలా తల్లి నాగమ్మా
దీవెనలియ్యవే దేవ నాగమ్మ దారి చూపవే శ్రీ నాగమ్మ
నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ
నీ బంగరు కాంతుల చల్లని పడగల దీవెనలీయమ్మ
అమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ
నీ బంగరు కాంతుల చల్లని పడగల దీవెనలీయమ్మ
క్షీరాబ్ది మథియించు వేళలో
పెద్ద కవ్వపు తాడుగా మారినా
వన్నెలీను వాసుకియే నాగదేవి నీ సుతుడే
వేదాల నాదాల సత్యమా అన్ని లోకాలకాశీస్సులియ్యమ్మా
శాశ్వత చైతన్యరూపమా మా సన్నుతులందుకో నాగమ్మా
సూర్యుడే సిగలో వెలిగే మణిలా తోచెనే
నింగిలోని మెరుపులన్ని నిన్నే చూపేనే
వెండికొండకే దారి నీవులే కొండ అంచులే నీ పడగలే
యోగకుండలి రూపానివే
అంతు తెలియని నాగశక్తివే
నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ
నీ బంగరు కాంతుల చల్లని పడగల దీవెనలీయమ్మ
అమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ
నీ బంగరు కాంతుల చల్లని పడగల దీవెనలీయమ్మ
నమ్మినవారికి నాగులచవితికి అమ్మవు నీవమ్మా
పసుపుకుంకుమ పడతులకొసగే దేవత నీవమ్మా
మా ఐదవతనముకు అభయమునిచ్చి అండగా ఉండమ్మ
చల్లని చూపుల నాగమ్మ మా పిల్లలపాపల కాయమ్మ
కరుణించు తల్లివి నీవమ్మా మాకు తోడునీడగ ఉండమ్మా
చల్లని చూపుల నాగమ్మ మా పిల్లలపాపల కాయమ్మ
కరుణించు తల్లివి నీవమ్మా మాకు తోడునీడగ ఉండమ్మా
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.