Home » చిత్తూరు పిల్ల (Chittoor Pilla) సాంగ్ లిరిక్స్, సతీ లీలావతి (Sathi Leelavathi)

చిత్తూరు పిల్ల (Chittoor Pilla) సాంగ్ లిరిక్స్, సతీ లీలావతి (Sathi Leelavathi)

by Lakshmi Guradasi
1.2K views
Chittoor Pilla song lyrics Sathi Leelavathi

ఓహ్ గుప్పెడంత ఆశ పెట్టుకుంటే కొంప ముంచి పోయేరో
బాహుబలి లాంటి ఈ బావ ను బద్నాము చేసిందిరో
గుండెలోన డప్పులు కట్టి పూజలే చేసారో..
చిన్ననాటి ఈ దేవదాసు ను ఛి కొట్టి పోయిందిరో…

మెరిక లాంటి కుర్రోడమ్మా
చురుకు చూపు చిన్నోడమ్మా
మన్సులోంచి కాసేపైనా పోనే పొడమ్మా

వలపు చిచ్చు పెట్టడమ్మా
వారుడి వేషం కట్టాడమ్మా
వాడివూసే రేయీ పగలూ అయ్యో రామా

సిద్ధమైంది కల్యాణ మాల
సిగ్గులేమౌనో తెల్లారేకల్లా
సంబరాల సందె వేళ
గట్టిమేలమిక వాయించరేలా…

ఓయే పిల్లా రాయే పిల్లా
చిక్కావే చక్కని చిత్తూరు పిల్లా
పానమల్లా తేనె చల్లా
నవ్వుతుంటే గుండె జల్లా

ఓయే పిల్లా రాయే పిల్లా
చిందేసి ఆడేటి చిత్తూరు పిల్లా
వెల్లువాయే పెళ్లి కల
ఇన్నినాళ్ళ తీపి కల తీరుతుంటే లేదంటే నమ్మేలా…

మెరిక లాంటి కుర్రోడమ్మా
చురుకు చూపు చిన్నోడమ్మా
వాడి వెంట సాగేదాకా ఆగేనా.. నా ప్రేమ

వాడ్ని ముద్దుతూ రోజంతా మురిపించేస్తాలే
చంటి పిల్లాడిలా కొంగుకే కట్టేసుకుంటాలే
ఎన్ని తప్పుల్ని చేస్తున్నా మన్నించేస్తాలే
కంట నీరైనా రాకుండా కాపాడుకుంటాలే

ఇద్దరి మధ్య యుద్దాలు వస్తే నేనే సారీ చెబుతాలే
అందరి ముందు శ్రీవారి గొప్పలు చాటింపు వేస్తాలే
ఎంత ప్రేముందే వాడంటే పిల్లా యాడ ఈ ఆశలెల్ల
మాటలేల మాపటేల మూడు ముళ్ల గోల కానిస్తే పోలా

ఓయే పిల్లా రాయే పిల్లా
చిక్కావే చక్కని చిత్తూరు పిల్లా
పానమల్లా తేనె చల్లా
నవ్వుతుంటే గుండె జల్లా

ఓయే పిల్లా రాయే పిల్లా
చిందేసి ఆడేటి చిత్తూరు పిల్లా
వెల్లువాయే పెళ్లి కల
ఇన్నినాళ్ళ తీపి కల తీరుతుంటే లేదంటే నమ్మేలా…

తోడులేని దారిలోని తొలిపరిచయమిదిగా
ప్రేమ కోరి జారుతున్న మనసిక నిలవదుగా
తడబడు అడుగులు మెల్లగా నడిచెను తన వెనక
లోలోన నా మది వింతే చూసాక
మురిసేనుగా వలపులు మొదలవగా
పలికిన వేద మంత్రమే కొసరేను ప్రేమ పరవాసమే
కలలని హృదయము కరిగిన సమయము
త్వరపడమని తరిమెను తనకిక జతగా…

______________

సాంగ్ క్రెడిట్స్ :

పాట: చిత్తూరు పిల్ల (Chittoor Pilla)
చిత్రం: సతీ లీలావతి (Sathi Leelavathi)
గాయకులు: నూతన మోహన్ (Nutana Mohan), కృష్ణ తేజేస్వి (Krishna Tejesvi), రితేష్ జి రావు (Ritesh G Rao)
సాహిత్యం: వనమాలి (Vanamali)
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
తారాగణం: లావణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela), దేవ్ మోహన్ (Dev Mohan),
నిర్మాత: నాగ మోహన్ (Naaga Mohan)
దర్శకుడు: తాతినేని సత్య (Tatineni Satya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.