Home » సాయి శరణం బాబా శరణం (sai saranam baba saranam) సాంగ్ లిరిక్స్

సాయి శరణం బాబా శరణం (sai saranam baba saranam) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
1.1K views
Sai Saranam Baba Saranam song lyrics

హే.. పాండురంగా
హే.. పండరి నాథా
శరణం శరణం శరణం

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం

విద్యా బుద్ధులు వేడిన బాలకు
అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని
కరుణించాడు సర్వేశ్వరుడై

తిరగలి చక్రం తిప్పి వ్యాధినే
అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా శ్యామాకు మారుతి గాను
మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని
దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం

పెను తుఫాను తాకిడిలో
అలమటించు దీనులను
ఆదరించె తాననాథ నాథుడై
అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై

వీధి వీధి బిచ్చమెత్తి
వారి వారి పాపములను పుచ్చుకొని
మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకున్న పాపములను
ప్రక్షాళన చేసికొనెను

దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరు చేసి
ఖండయోగ సాధనలో
ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై

జీవరాశులన్నిటికి సాయే శరణం… సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం… సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం… నాస్తికులకు సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం… నాస్తికులకు సాయే శరణం
భక్తికీ సాయే శరణం… ముక్తికీ సాయే శరణం
భక్తికీ సాయే శరణం… ముక్తికీ సాయే శరణం

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే

________

పాట: సాయి శరణం బాబా శరణం (Sai Saranam Baba Saranam)
సినిమా పేరు: శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం (Sri Shirdi Sai Baba Mahathyam)
గాయకుడు: యేసుదాస్ (Yesudas)
సంగీతం: ఇళయరాజా (Ilayaraja)
నటీనటులు: శ్రీ షిర్డీ సాయి బాబా మహత్యం (Sri Shirdi Sai Baba Mahathyam)
దర్శకుడు: కె. వాసు (K. Vasu)
నిర్మాత: గోగినేని ప్రసాద్ (Gogineni Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.