Home » వెల్లూరు బంగారు దేవాలయం, శ్రీలక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ విశేషాలు!

వెల్లూరు బంగారు దేవాలయం, శ్రీలక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ విశేషాలు!

by Lakshmi Guradasi
416 views
Vellore golden temple history tourism guide

వేలూరు, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక చారిత్రక ఘనత కలిగిన, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన నగరం. ఇది తిరుపతి నుండి సుమారు 100 కిలోమీటర్లు, చిత్తూరు నుండి 30 కిలోమీటర్లు, చెన్నై నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమల దర్శనం చేసుకున్న చాలా మంది భక్తులు వేలూరు గోల్డెన్ టెంపుల్ ను సందర్శించడానికి ఇష్టపడతారు. ఈ నగరంలో ముఖ్యంగా చూడదగిన ప్రదేశాలు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ (Sripuram golden temple), వేలూరు కోట (Vellore fort)మరియు జలకంటేశ్వర దేవాలయం (Jalakandeswarar Temple). 

శ్రీపురం గోల్డెన్ టెంపుల్ (వేలూరు బంగారు ఆలయం):

Vellore golden temple story: ఈ దేవాలయాన్ని శ్రీపురం గోల్డెన్ టెంపుల్ లేదా వేలూరు గోల్డెన్ టెంపుల్ (Vellore golden temple) అని పిలుస్తారు. ఇది వందల ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణ కళాఖండం. ఇక్కడ 70 కేజీల స్వర్ణలక్ష్మి అమ్మవారు బంగారంతో చేసిన విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం యొక్క గొప్ప విశేషం ఏమిటంటే, భక్తులు తమ చేతులతోనే అమ్మవారికి అభిషేకం చేయవచ్చు. దీని ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం.

వెల్లూరు స్వర్ణ దేవాలయం చరిత్ర:

తమిళనాడులోని శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయం, శక్తి అమ్మ (అసలు పేరు సతీష్ కుమార్) కృషి ఫలితంగా నిర్మించబడింది. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కనబరచిన సతీష్ కుమార్, 16వ ఏట ‘శక్తి అమ్మ’గా పేరు మార్చుకున్నారు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించిన ఆయన, శ్రీపురం వద్ద ఆకాశంలో నారాయణి రూపంలో కాంతి రేఖను దర్శించిన తర్వాత పీఠం ఏర్పాటుకు ప్రేరణ పొందారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో, 1500 కిలోల బంగారంతో, 400 మంది శిల్పుల నిరంతర శ్రమతో, సుమారు 600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అద్భుత స్వర్ణ దేవాలయం రూపుదిద్దుకుంది. రాగి రేకులను వేడి చేసి, వాటిపై బంగారు రేకులను పలో వేసి, ఆ తర్వాత శిల్పాలుగా తీర్చిదిద్దడం ద్వారా ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఆలయ గోడలపై భగవద్గీతలోని శ్లోకాలు మరియు ప్రవచనాలు వ్రాయబడ్డాయి.

ఆలయ విశేషాలు మరియు రహస్యాలు (Vellore sripuram golden temple Secrets):

అభిషేక అనుభవం: ఉదయం 4:30 AM నుండి 5:00 AM మధ్య అభిషేకం సమయంలో ఆలయాన్ని సందర్శిస్తే అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. ఈ సమయంలో ఆలయ ఏనుగు అమ్మవారి అభిషేకానికి నీటిని అందిస్తుంది. ఈ అనుభవం వర్ణించలేనిది.

అమ్మవారి విగ్రహం: అమ్మవారి విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. చందన అభిషేకం సమయంలో ఆమె చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. శిల్పి తొమ్మిది ప్రయత్నాల తర్వాత, గోశాలలో తయారు చేసిన తొమ్మిదో విగ్రహం పరిపూర్ణంగా వచ్చిందని నమ్మకం.

నాసికా ఆభరణాలు: అమ్మవారికి సూర్య మరియు చంద్రులను పోలిన ముక్కు పుడకలు ఉన్నాయి. ఇవి యోగ రహస్యాలైన ఇడ మరియు పింగళ నాడులను సూచిస్తాయి. ఆమె మెడలో దశావతారాలతో కూడిన బంగారు గొలుసు ఉంటుంది.

నిధి దేవతలు: ప్రవేశ ద్వారం వద్ద బంగారంతో చేసిన శంఖ నిధి మరియు పద్మ నిధి దేవతల విగ్రహాలు ఉంటాయి. తిరుమలలో ఉన్న వాటికంటే ఇక్కడ పెద్దవిగా, బంగారంతో చేసినవిగా ఉంటాయి.

బంగారు పద్మ పాదాలు: భక్తుల స్పర్శ కోసం ప్రత్యేకంగా బంగారు పద్మ పాదాలు ఏర్పాటు చేయబడ్డాయి. శక్తి అమ్మ ప్రకారం, అమ్మవారి పాదాలు ముఖ్యమైనవి మరియు భక్తుల హృదయాలను శుద్ధి చేస్తాయి.

వెండి గోమాత: ఆలయంలో ఒక వెండి గోమాత విగ్రహం కూడా ఉంది. దీనిని తాకి నమస్కరించడం వల్ల గో మాతాలక్ష్మిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని నమ్మకం. శక్తి అమ్మ దీనిని గోమాతను భక్తి భావనతో చూడటం కోసం ఏర్పాటు చేసారు.

గోశాల విశేషాలు: ఆలయ గోశాలలో వందల కొద్దీ ఆవులు ఉన్నాయి, వాటిని రాణులుగా చూసుకుంటారు. ప్రతి భారతీయ ఆవు జాతికి కనీసం ఒక ఆవు ఇక్కడ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ గోశాలను సందర్శించి అభినందించారు. అనారోగ్యంతో ఉన్న ఆవులను వధశాలలకు తీసుకెళ్తుండగా, శక్తి అమ్మ వాటిని విడిపించి ఈ గోశాలను స్థాపించారు. ఆవులు మరణించినప్పుడు మానవుల వలె సంస్కారాలు నిర్వహిస్తారు.

నాలుగు గోపురాలు: ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో నిలబడితే, నాలుగు గోపురాలు (సర్వ కామితార్ధ విమానం, గజ పృష్ట విమానం, అస్థాన విమానం) ఒకేసారి కనిపిస్తాయి. ఇవి తిరుమల (Tirumala) మరియు శ్రీరంగం (Srirangam) గోపురాలను పోలి ఉంటాయి, అమ్మవారికి ఇష్టమైనవిగా భావిస్తారు.

70 కేజీల బంగారు లక్ష్మి విగ్రహం (అభిషేకం కోసం): ప్రధాన విగ్రహానికి అభిషేకం చేయడానికి కఠిన నిబంధనలు ఉన్నందున, అందరూ అభిషేకం చేయడానికి వీలుగా శక్తి అమ్మ 70 కిలోల బంగారు విగ్రహాన్ని చేయించారు. ఈ విగ్రహాన్ని దుబాయ్ నుండి ఒక ముస్లిం భక్తురాలు సమర్పించారని తెలుస్తోంది. బంగారంపై ఎలాంటి ఆంక్షలు లేనందున అందరూ దీనిని తాకి అభిషేకం చేయవచ్చు.

నిరంతర పూజలు: ఆలయంలో నిరంతరం శ్రీ సూక్తం హోమం జరుగుతుంది. ఉదయం నుండి రాత్రి వరకు 72 మంది పూజారులు వైదిక మంత్రాలను పఠిస్తూ ఉంటారు. ఆలయం అంతటా పసుపు, కుంకుమ, ఆవులు, పూలు, పరిశుభ్రత వంటివి కనిపిస్తాయి.

నారాయణి పీఠం సేవలు: నారాయణి పీఠం ఆధ్వర్యంలో నారాయణి స్కూల్, నారాయణి ఆసుపత్రి, నారాయణి రెస్టారెంట్ ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ 6000-7000 మందికి ఉచిత భోజనం అందిస్తారు. శక్తి అమ్మ కేవలం 44 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికీ, నాస్తిక ప్రభుత్వం ఉన్న ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించి, సనాతన ధర్మాన్ని నిశ్శబ్దంగా వ్యాపింపజేస్తున్నారు. ఆయన ప్రతి రాత్రి 3 గంటల పాటు అమ్మవారిని పూజించి, ప్రేమతో ప్రతి వ్యక్తికి తీర్థాన్ని అందిస్తారు.

దర్శన నియమాలు: ఆలయం లోపల మొబైల్ ఫోన్‌లు అనుమతించబడవు. శక్తి అమ్మ సూచనల ప్రకారం, టిక్కెట్లు లేకుండానే అందరూ అమ్మవారిని దర్శించుకోవచ్చు. అయితే, రూ.100, రూ.250, రూ.500, రూ.1000 వంటి వివిధ టిక్కెట్ దర్శనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణ దర్శన సమయాలు ఉదయం 9:45-10:00, మధ్యాహ్నం 12:15-12:30, సాయంత్రం 2:50-3:30 మధ్య ఉంటాయి.

గోల్డెన్ టెంపుల్‌కు ఎలా వెళ్లాలి: 

వేలూరు బస్ స్టాండ్ నుండి గోల్డెన్ టెంపుల్‌కు చేరుకోవడానికి షేర్ ఆటోలు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆటోకు సుమారు రూ. 30 ఖర్చవుతుంది. గోల్డెన్ టెంపుల్ బస్ స్టాండ్ నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

వేలూరు కోట (Vellore Fort):

వేలూరు బస్ స్టాండ్‌కు ఎదురుగా ఉన్న ఈ కోట, విజయనగర రాజులచే నిర్మించబడింది. ఇది అనేక రాజ్యాల పాలనలో ఉంది, వాటిలో బీజాపూర్ సుల్తాన్‌లు, మరాఠాలు, కర్ణాటక నవాబులు, బ్రిటిష్ వారు మరియు టిప్పు సుల్తాన్‌లు ఉన్నారు. ఈ కోటలో శ్రీలంక రాజు విక్రమ రాజసింగే మరియు అతని కుటుంబాన్ని బంధించారు. 1806లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటుకు ఈ కోట వేదికగా నిలిచింది.

కోట చుట్టూ లోతైన కందకం ఉంది. కోట పక్కనే ఒక సరస్సు లాంటి ప్రాంతం ఉంది, ఇక్కడ ప్రజలు విశ్రాంతి తీసుకోవచ్చు. కోట సాయంత్రం 5 గంటలకు మూసివేయబడుతుంది. కోట లోపల ఒక మ్యూజియం మరియు జలకంటేశ్వర దేవాలయం ఉన్నాయి, ప్రవేశం ఉచితం.

జలకంటేశ్వర దేవాలయం (Jalakandeswarar Temple):

ఈ అద్భుతమైన దేవాలయం వేలూరు కోట లోపల ఉంది. దీనిని విజయనగర సామ్రాజ్యానికి చెందిన సదాశివరావు నిర్మించారు. ఈ ఆలయం నిర్మాణ శైలికి చాలా ప్రసిద్ధి. ఆలయం లోపల ఒక చిన్న కోనేరు కూడా ఉంది. తమిళనాడులోని దేవాలయాలు వాటి అద్భుతమైన శిల్పకళకు పెట్టింది పేరు.

ఒకప్పుడు బ్రిటిష్ వారు ఈ కోటను సైనిక కేంద్రంగా, ఆయుధాలు మరియు ఆహార పదార్థాల గోదాముగా ఉపయోగించారు. తరువాత సుందరస్వామి మరియు రామశేష సరస్వతి స్వామి అనే మహానుభావులు ఇక్కడ శివలింగాన్ని తిరిగి ప్రతిష్టించి, పూజా కార్యక్రమాలను పునరుద్ధరించారు. ఆలయంలో ఉన్న కళ్యాణ మండపం విజయనగర శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణ.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.