నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర
వాడు వీడు పండగంటే ఊచ ఊచకోతరా
కొండ దేవర.. కొండ దేవర
ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు ఉప్పు పాతర
తన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేర
కొండ దేవర.. కొండ దేవర
కొండ దేవర.. కొండ దేవర
కొండ దేవర.. నేల గాలి మాది
కొండ దేవర.. మట్టి తల్లి మాది
కొండ దేవర.. నీరు నిప్పు మాది
కొండ దేవర.. కొండ కోన మాది
ఎర్ర ఎర్ర సుర్యునేమో బొట్టునాల దిద్ది
వెలుగు నింపినావు బతుకున..
నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది
ఉయ్యాలూపినావు జోలన..
మా నిన్న మొన్న మనమంటే నువ్వే
వేయి కన్నులున్న బలగం నువ్వే
నువ్ ఉంటావమ్మా ఇయ్యాల రేపు
మా వెన్నుదండు మార్గం చూపే
పాడు కళ్ళుచూడు తల్లి గుండేదాకా ఇడకొచ్చినయిరా
హే ఎల్లగొట్టుదాము విల్లు ఎత్తినాము
బెల్లుమంటూ దూకదా
కొండ దేవర.. కొండ దేవర
కొండ దేవర.. కొండ దేవర
కొండ దేవర.. నేల గాలి మాది
కొండ దేవర.. మట్టి తల్లి మాది
కొండ దేవర.. అండ నీవురా
కొండ దేవర.. గుండె నీదిరా
కొండ దేవర.. అండ నీవురా
కొండ దేవర.. గుండె నీదిరా
___________________
సాంగ్: కొండ దేవర (Konda Devara)
సినిమా: గేమ్ ఛేంజర్ (Game Changer)
గాయకుడు: తమన్ ఎస్ (Thaman S), శ్రావణ భార్గవి (Sravana Bhargavi)
లిరిక్స్ : కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీత దర్శకుడు: థమన్ ఎస్ (Thaman S)
నటుడు : రామ్ చరణ్ (Ram Charan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.