Home » ఎదో ఏదో అయిపోతుంది సాంగ్ లిరిక్స్

ఎదో ఏదో అయిపోతుంది సాంగ్ లిరిక్స్

by Nikitha Kavali
0 comments
Edo edo ayipothundi song lyrics

ఏదో ఏదో అయిపోతుంది
యెదలో ఏదో మొదలయ్యింది
నిన్నే చూడాలని
నీతో ఉండాలని
నేనే ఓడాలని
నువ్వే గేలవాలని
పదే పదే అనిపిస్తుంది
నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో
తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో
ఎరుగని కొంటె భావన

కళ్ళేమో కళలు మాని నిన్ను వెతుకుతుంటే
మనసేమో పనులు మాని నిన్ను తలచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవరపడుతుంటే
చెయ్యి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక
తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక
నిన్నే తాకాలని నీతో గడపాలని
ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని
మనసేమో మానసిచ్చింది

అది ప్రేమో ఏమో
తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో
ఎరుగని కొంటె భావన
ఏదో ఏదో అయిపోతుంది
యెదలో ఏదో మొదలయ్యింది

ఆరాటం హద్దు ధాటి మాట చెప్పమంటే
మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే
ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమి పాలుపోక సగపాలే నువ్వయ్యాక
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక
నువ్వే కావాలని నిన్నే కలవాలని
మనసే విప్పాలని మాటే చెప్పాలని
ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్లింత కలిగిస్తుంది

అది ప్రేమో ఏమో
తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో
ఎరుగని కొంటె భావన
ఏదో ఏదో అయిపోతుంది
యెదలో ఏదో హ్మ్ హ్మ్

చిత్రం: నువ్వు లేక నేను లేను
దర్శకుడు: కాశీ విశ్వనాధ్
సంగీతం: R.P. పట్నాయక్
గాయకులూ: ఉష
నటులు: తరుణ్, ఆర్తి అగర్వాల్, శరత్ బాబు, చంద్ర మోహన్ తదితరులు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.