Home » అనగనగా కథ (Anaganaga Kadha) సాంగ్ లిరిక్స్ | Kuberaa

అనగనగా కథ (Anaganaga Kadha) సాంగ్ లిరిక్స్ | Kuberaa

by Lakshmi Guradasi
3.2K views
Anaganaga Kadha song lyrics Kubera

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

నమ్మే వాడిని అమ్మేయడం….
మొక్కేవాడిని తొక్కేయడం..
దొరికేవాడిని దోచేయడం..
తల వంచేవాడిని ముంచేయడం..

యుగాల నుండీ..
జరుగుతున్న కథ..
యుగాంతమైనా మారిపోని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

వంతెన కట్టేదొకడు..
దాన్ని దాటే వాడింకొకడు..
నిచ్చెన వేసేదొకడు…
పైపెకెక్కే వాడింకొకడు..
ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..
ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం..

పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి ఉందా!??
బీదల కన్నుల నీటిని తుడవని కథలకు అర్ధం ఉందా..?!?

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

లేని వాడికి నోటి ఆకలి..
ఉన్నవాడికి నోట్ల ఆకలి..
నోటికి తెలుసును వద్దు వద్దు..
నోట్లకు తెలియదు హద్దు పద్దు..

బలహీనుడికి ఆశే ఉంటది..
బలవంతుడికి అత్యాశుంటది..

ఓ.. ఆశకు బ్రతుకే సరిపోద్ది..
ఒక బ్రతుకే సరిపోద్ది..
అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటది..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

_________________

పాట పేరు : అనగనగా కదా (Anaganaga Kadha)
సినిమా పేరు: కుబేర (Kuberaa)
గాయకులు: హైడ్ కార్తీ (Hyde Karty), కరీముల్లా (Kareemullah)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
నటీనటులు – ‘కింగ్’ నాగార్జున అక్కినేని (‘King’ Nagarjuna Akkineni), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika Mandanna), జిమ్ సర్భ్ (Jim Sarbh)
దర్శకుడు – శేఖర్ కమ్ముల (Sekhar Kammula)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.