గాంధర దేశ రాజును నలుగురు కుతుళ్లు వారసుడు లేడని చింతస్తున్న రాజకు అయిదో సంతానంగా మగబిడ్డ పుట్టాడు. లేక లేక కలగడంతో ఆ పిల్లాడిని అతి గారాబం చేశాడు. రాజు దీని వల్ల యువరాజు పెంకిగా సోమరిపోతగా తెలివి తక్కువ వాడిగా తయారయ్యాడు విద్యాభ్యాసానికి పంపినా సరిగా చదువుకోకుండా కాలక్షేపం చేసి వచ్చాడు. ఒక రోజు ఎవరో ఒక కోతి పిల్లలను రాజుగారికి కానుకగా ఇచ్చారు. అది మాట్లాడే కోతి దాని స్థానంలో దాన్ని ఉంచకుండా యువరాజుకు కానుకగా ఇచ్చాడు. రాజు అది నిత్యం రాజకుమారుడితోనే ఉండేది. రాజ్యం ప్రజల సంగతి కూడా పట్టించు కోకుండా యువరాజు ಆ కోతి తోనే ఆటలాడేవాడు. దానికి తనకొచ్చిన పనులు విద్యలు నేర్పేవాడు. ఒక రోజు దాని చేతికి కత్తి ఇచ్చి ఎలా వాడాలో నేర్పించాడు. అంతేకాదు నువ్వు నా రక్షకుడివి నా మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన భాధ్యత నీదే అని చెప్పాడు. ఇంకేముంది అప్పట్నించి కోతి కత్తి తిప్పుతూ యువరాజు వెనుక నడిచేది ఓ సారి యువరాజు గాఢనిద్రలో ఉన్నాడు. ఓ ఈగ అతడి ముఖంపై వాలింది. కోతి గట్టిగా అరుస్తూ దాన్ని తోరింది. యువరాజు మెలకువ వచ్చి ఎందుకు అరిచావంటూ తిట్టి మళ్లీ నిద్రపోయాడు ఈ సారి ఈగ యువరాజుకు మోకాలిపై వాలింది. కోతికి ఏం చేయాలో తోచలేదు. అరిస్తే యువరాజు లేచి తిడతాడు అనుకుంది. వెంటనే చేతిలోని కత్తిలో ఈగ పై ఒక వేటు వేసింది. ఇంకేముంది కత్తి కాలికి లోతుగా గాయం చేసింది. యువరాజు ఆరుస్తూ లేచాడు కోతి విషయం చెప్పింది. కోతి లాంటి ఒక మూర్ఖునితో స్నేహం చేయడం వಲ್ಲ యువరాజు అవిటి వాడయ్యాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.